https://oktelugu.com/

దీపావళి రోజున ఈ మూడు వత్తుల దీపం వెలిగిస్తే ఎన్ని లాభాలో?

సాధారణంగా దీపావళి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సాయంత్రం సమయంలో ప్రతి ఒక ఇంటిలో దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా బాణాసంచాలు కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. దీప అంటే దీపము,ఆవలి అంటే వరుస అని అర్థం. దీపావళి రోజున దీపాలను వరుస క్రమంలో అమర్చడం అని అర్థం. Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా? ఈ దీపావళి రోజున చీకటిని అంటే అంధకారమును పారద్రోలుతూ వెలుగులు అనగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2020 / 12:09 PM IST
    Follow us on

    సాధారణంగా దీపావళి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సాయంత్రం సమయంలో ప్రతి ఒక ఇంటిలో దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా బాణాసంచాలు కాలుస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. దీప అంటే దీపము,ఆవలి అంటే వరుస అని అర్థం. దీపావళి రోజున దీపాలను వరుస క్రమంలో అమర్చడం అని అర్థం.

    Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?

    ఈ దీపావళి రోజున చీకటిని అంటే అంధకారమును పారద్రోలుతూ వెలుగులు అనగా ఐశ్వర్య నింపుతూ జరుపుకునే ఒక వేడుక. అలాంటి దీపాలను మన ఇంటిలో వెలిగించడం ద్వారా మన ఇంటిలో ఉన్న అంధకారం మొత్తం తొలగిపోయే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రతి ఒక్కరు దీపావళి రోజు దీపాలు వెలిగిస్తారు.

    సాధారణంగా దీపాన్ని త్రిమూర్తి స్వరూపమని అంటారు. అంటే దీపపు వెలుగులో త్రిమూర్తులు ముగ్గురు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. దీపంలో ఎరుపు రంగు కాంతి బ్రహ్మదేవునికి ప్రతీక, నీలి రంగు కాంతి ఆ విష్ణుమూర్తికి ప్రతీక, తెలుపు రంగులో ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే దీపావళి రోజున చాలామంది ఒకటి,రెండు వత్తులను వేసి దీపాలను వెలిగిస్తారు. అలా చేయడం ద్వారా మన ఇంటికి మంచిది కాదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

    Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?

    ఎప్పుడైనా దీపాలను వెలిగించే టప్పుడు మూడు వత్తులను వేసి వెలిగించడం ద్వారా మన ఇంటికి శుభం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న అంధకారాన్ని మొత్తం పారద్రోలి లక్ష్మీ నిలయం గా మారుస్తుంది.దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కనుక ఎంతో భక్తి భావంతో వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అదేవిధంగా దీపావళి రోజున సాయంత్రం ఏ ఇంటి ముందు అయితే దీపాలు వెలుగుతాయో ఆ ఇంటిలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని భావిస్తారు కనుక ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు దీపాలతో వారి ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు.