https://oktelugu.com/

‘మెగా’ బాంబ్.. ఆచార్య మరింత ఆలస్యం?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ రాబోతుండటంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతేడాది దసరా రోజున ‘ఆచార్య’ సినిమా ప్రారంభమైంది. నాటి నుంచి ‘ఆచార్య’ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు మాత్రం అనేక ఇబ్బందులు పడుతోంది. Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..! ‘ఆచార్య’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా వాయిదా పడింది. గత […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 11:58 AM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ రాబోతుండటంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతేడాది దసరా రోజున ‘ఆచార్య’ సినిమా ప్రారంభమైంది. నాటి నుంచి ‘ఆచార్య’ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు మాత్రం అనేక ఇబ్బందులు పడుతోంది.

    Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!

    ‘ఆచార్య’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా వాయిదా పడింది. గత ఆరేడు నెలలుగా టాలీవుడ్లో సినిమాలు నిలిచిపోయాయి. తాజాగా ‘ఆచార్య’ మూవీని తెరకెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నహాలు చేశారు. ఇందులో భాగంగా చిత్రయూనిట్లోని వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు.

    Also Read: వెంకీ-రానా కాంబోపై మొదలైన నెగిటివ్ టాక్..!

    ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభానికి ముందే మెగాస్టార్ చిరంజీవి అనుహ్యంగా కరోనా బారినపడ్డారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎల్లప్పుడు అందరినీ అప్రమత్తం చేసే మెగాస్టార్ కరోనా బారిన పడటంతో టాలీవుడ్ మొత్తం ఉలికిపాటుకు గురైంది. దీంతో మెగాస్టార్ హోంక్వారంట్లోకి వెళ్లాడు. తనను గత నాలుగైదు రోజులుగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి ఒక లేఖలో కోరాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మెగాస్టార్ కరోనా బారిన పడటంతో ‘ఆచార్య’ షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తుంది. మెగాస్టార్ దాదాపు నెలరోజులపాటు ‘ఆచార్య’ దూరమయ్యేలా ఉన్నారు. మెగాస్టార్లో కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అయితే ‘ఆచార్య’ షూటింగును కొనసాగించమని చిరంజీవి దర్శకుడికి సూచించినట్లు తెలుస్తోంది. చిరంజీవి లేకుండా దర్శకుడు కొరటాల ‘ఆచార్య’ను ఏమేరకు ముందుకు తీసుకెళుతారో వేచిచూడాల్సిందే..!