
ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకునే దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దీపాల అలంకరణ,కొత్త బట్టలు,పిండివంటలు,బాణసంచాలతో ఎంతో హడావిడిగా ఈ పండుగను జరుపుకుంటారు.
జాతి,కులాల విభేదం లేకుండా అన్ని మతాల వారు ఎంతో ఐక్యతగా నిర్వహించుకునే ఈ పండుగ రోజున ఆ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను చేసి ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ రోజున ఎందుకు బాణాసంచాలు కాలుస్తారు? దీపాలను ఎందుకు అలంకరిస్తారు? ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి? అన్న విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: దీపావళి రోజున దీపాలకు బదులుగా కొవ్వొత్తుల వెలిగిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!
దీపావళి పండుగ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపుతూ జరుపుకునే ఈ పండుగ గురించి మన పురాణాలలో అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నరకాసురుడనే రాక్షసుడిని ఆ లక్ష్మీదేవి వధించడం వల్ల నరకాసురుడి పీడ వదిలించుకొన్న ప్రజలు ఆనందంతో బాణాసంచా కాలుస్తారు. అమ్మవారు నరకాసురుని వధించినది అమావాస్యకు ముందు రోజు అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున చంపడం వల్ల దీపావళికి ముందు రోజును నరక చతుర్దశి గా జరుపుకుంటారు.దీపావళి పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. కాబట్టి ఈ జగమంతా చీకటిగా ఉండటం వల్ల ఆ చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపడానికి దీపాలను వెలిగిస్తారు.
మన పురాణాల ప్రకారం సీతను అపహరించిన రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధం చేసి రావణాసుని వధించి సీతను తీసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఆశ్వయుజ మాసం అమావాస్య కావడం వల్ల ఆ రోజున ప్రజలు శ్రీరామునికి దీపాలతో అయోధ్యకు స్వాగతం పలుకుతారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా ఈ దీపావళిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని రామాయణం కూడా చెబుతుంది.
Also Read: దీపావళి రోజున ఈ మూడు వత్తుల దీపం వెలిగిస్తే ఎన్ని లాభాలో?
కౌరవులు, పాండవులకు మధ్య జరిగిన జూదంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో పాండవులు ఓడిపోవడం ద్వారా 13 సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరంపాటు అజ్ఞాతవాసంలో ఉంటారు. వారి వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి వస్తారు ఈ సందర్భంగా ఆ రాజ్యంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాండవులకు దీపాలతో స్వాగతం పలుకుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఎన్నో కష్టాలు తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా బాణాసంచాలతో, దీపాల అలంకరణతో, ఈ పండుగను జరుపుకుంటారు.