దక్షిణాదిలో సూపర్ హిట్ సాధించిన ‘కాంచన’ మూవీ బాలీవుడ్లో ‘లక్ష్మీ’గా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోగా నటించిన రాఘవ లారెన్స్ ‘లక్ష్మీబాంబ్’ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. బాలీవుడ్లో లాఘవ లారెన్స్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘లక్ష్మీ’ తాజాగా ఓటీటీలో రిలీజైంది.
Also Read: ‘మెగా’ బాంబ్.. ఆచార్య మరింత ఆలస్యం?
‘లక్ష్మీ’ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించగా కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది. కాంచన మూవీలో కొన్ని మార్పులు చేర్పులు దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ మూవీని బాలీవుడ్లో తెరకెక్కించాడు. కథ విషయానికొస్తే.. ఆసిఫ్(అక్షయ్ కుమార్)కు దెయ్యాలు.. భూతాలంటే నమ్మకాలుండవు.. ఆసిఫ్ ఓ హిందూ అమ్మాయి రష్మి(కియరా అద్వానీ)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దీంతో రష్మి కుటుంబానికి దూరం అవుతుంది.
Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!
కొన్నిరోజుల తర్వాత రష్మి తల్లిదండ్రుల పాతికేళ్ల పెళ్లిరోజు సెలబ్రేషన్స్ కోసం వారిద్దరు అక్కడికి వెళుతారు. వారింటికి దగ్గరలో ఉండే ఓ ఖాళీ ప్రాంతంలో దెయ్యాలున్నాయని అక్కడివాళ్లు భయపడుతుంటారు. అయితే ఆసిఫ్ అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్లి క్రికెట్ ఆడతాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాక విచిత్రమైన పరిస్థితులు జరుగుతుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
దెయ్యాలంటే భయపడని ఓ యువకుడికి ఒంట్లోకి దెయ్యం ప్రవేశిస్తే ఎలా ఉంటుంది.. ట్రాన్స్ జండర్ లుక్కులో అక్షయ్ కుమార్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కియరా అద్వానీ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. రాజేశ్ శర్మ, మను రిషి చాధా, అశ్విని కల్సేకర్, అయేషా తదితరులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించారు. సంగీతం బావుంది. సినిమాలో లాజిక్స్ లేకపోవడం.. నటీనటులు అతిచేయడం తప్పించి సినిమా ఓవరల్ బాగుందనే టాక్ తెచ్చుకుంది.