Things to keep at Home: మనదేశంలో వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే చీపురును లక్ష్మిదేవినిగా భావిస్తారు. చీపురును ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. దీంతో చీపురును ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. దానికి ఓ ప్రత్యేక స్థానం కేటాయించుకోవాలి. ఎప్పుడు కూడా యజమానికి చీపురు కనిపించకుండా ఉంచడమే మంచిది. నియమాలు పాటించకపోతే మనకు నష్టాలే వస్తాయి. దీంతో చీపురును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం సమంజసం కాదని తెలుస్తోంది. లక్ష్మిదేవికి ప్రతిరూపంగా చూస్తారు కాబట్టే చీపురును సరైన దిశలో ఉంచుకోవాలి. చీపురును వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిన చీపురును వాడకూడదు. చీపురును సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చీపురును నిలబెట్టకూడదు. పడుకోబెట్టాలి. చీపురును వాడే క్రమంలో తీసుకునే జాగ్రత్తల గురించి వాస్తులో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. లక్ష్మిదేవి స్వరూపంగా భావించినా చీపురును ఎక్కడ ఉంచాలనేదానిపై స్పష్టమైన దిశలు సూచించారు.
Also Read: Seediri AppalaRaju: గోల్డెన్ చాన్స్ వస్తే… మిస్ చేసుకుంటున్న మంత్రి
చీపురును ఎప్పుడు కూడా పూజా గదికి సమీపంలో ఉంచకూడదు. తలుపు దగ్గర కూడా ఉంచరాదు. ఎప్పుడైనా చీపురును ఓ సురక్షితమైన మూలను చూసుకుని అక్కడ పడుకోబెట్టాలి. ఎప్పుడైనా నిలబెట్టకూడదు. అలా చేస్తే మనకు వ్యతిరేక ఫలితాలే వస్తాయని గుర్తుంచుకోవాలి. చీపురును వాడే ఇల్లాళ్లు దాని గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పుడు కూడా విరిగినవి, పాడైనవి ఉపయోగించకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మిదేవికి కోపం వస్తుందని తెలుసుకోవాలి.
చీపురు విరిగిపోతే దాన్ని పారేయాలి. అది కూడా శనివారం రోజు మాత్రమే పాడేయాలి. అమావాస్య రోజు కూడా చేయవచ్చు. ఎప్పుడైనా చీపురు సక్రమమైనదే వాడుకోవాలి. చీపురు ఎప్పుడు కూడా పాడైపోయిన దాన్ని ఇంటిలో ఉంచుకుంటే దారిద్ర్యమే. అందుకే చీపురును వీలైనంత వరకు బాగున్న దాన్నే ఇంట్లో ఉంచుకోవాలి. లేదంటే మనకు దుష్ర్పభావాలు నెలకొంటాయి. ఈ విషయాలు గ్రహించుకుని ఇంట్లో చీపురును జాగ్రత్తగా ఉంచుకుని పాడైపోయిన దాన్ని దూరం చేసుకుంటేనే ఉత్తమం అని గుర్తుంచుకోవాలి.