https://oktelugu.com/

క్రిస్మస్ తాత ‘శాంటా క్లాజ్’ కథ తెలుసా?

క్రిస్మస్ అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది కేకు.. ఆ తర్వాత బహుమతులు.. క్రిస్మస్ తాత.. ‘శాంటా క్లాజ్’ ఈ బహుమతులు పంచుతుంటాడు. క్రైస్తువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు ఆ తాత అందరికీ బహుమతులు ఇస్తుంటాడు. Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..! ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం.. ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2020 / 02:12 PM IST
    Follow us on

    క్రిస్మస్ అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది కేకు.. ఆ తర్వాత బహుమతులు.. క్రిస్మస్ తాత.. ‘శాంటా క్లాజ్’ ఈ బహుమతులు పంచుతుంటాడు. క్రైస్తువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు ఆ తాత అందరికీ బహుమతులు ఇస్తుంటాడు.

    Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..!

    ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం.. ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రెట్ గా ఓ ప్లేసులో ఉంచి వారు చూసేలా చేసి సర్ ప్రైజ్ చేస్తారు.

    పురాతన కాలంలో   క్రిస్మస్ తాత ‘శాంటాక్లాజ్’ వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్లేవాడని నమ్మించేవారు. తల్లిదండ్రులే ఇచ్చిన శాంటాక్లాజ్ పేరు చెప్పేవారు. పండుగ సందర్భంగా ఇది అందరికీ చేరువై ఓ నమ్మకంగా ఏర్పడింది.

    ఈ పండుగకు బహుమతులను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇచ్చేవారు. విదేశాలలో ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు. ఇలా ఇదే పద్ధతి విస్తరించి క్రిస్మస్ నాడు ‘శాంటాక్లాజ్’ అనే తాత వచ్చి బహుమతులు ఇస్తాడనే నమ్మకం క్రైస్తవుల్లో బలపడింది. దీని వెనుక ఒక కథ కూడా ప్రచారం లో ఉంది..

    Also Read: క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

    *క్రిస్మస్ తాత వెనుక కథ..
    ఓ ధనికుడైన వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయటకు వెళ్లేవాడు. ఓ వీధిలో పేద కుటుంబాన్ని చూసి చలికి వణుకుతున్న వారి పరిస్థితి చూసి చలించిపోయాడు. దుప్పట్లు లేక వణుకుతున్న వారిని చూసి బాధపడ్డాడు. పిల్లలు కూడా బట్టలు లేకుండా కనిపించడం చూసి వారికి సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రెట్ గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు. అప్పుడు ఆయన తలకు చలి టోపి, కోటును ధరించి చేతిలో కర్రతో ఉన్నట్టు గమనించారు. ఆ దేవుడే శాంటాక్లాజ్ (క్రిస్మస్ తాత) ను పంపించాడని నమ్మి అప్పటి నుంచి ఇది పుట్టుకొచ్చిందని నమ్ముతారు. ప్రజలంతా శాంటాక్లాజ్ ను నమ్ముతున్నారు. ఈ అసలు కథ బైబిల్ లోనూ ఉంది.