https://oktelugu.com/

ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీ మరోసారి తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తమ ప్రభుత్వం వల్లే ఇప్పుడు ప్రపంచంలో భారత్ వెలిగిపోతోందని చెప్పుకొచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ భారత్ ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చామన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు నచ్చచెప్పారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read:  మూడు డిగ్రీలో చలిలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..! కొత్త వ్యవసాయ చట్టాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతులకు అనేక […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2020 / 02:32 PM IST
    Follow us on

    ప్రధాని మోడీ మరోసారి తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తమ ప్రభుత్వం వల్లే ఇప్పుడు ప్రపంచంలో భారత్ వెలిగిపోతోందని చెప్పుకొచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ భారత్ ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చామన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు నచ్చచెప్పారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read:  మూడు డిగ్రీలో చలిలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..!

    కొత్త వ్యవసాయ చట్టాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. కొత్త చట్టాలతో రైతులు తమ పంటలను ఎక్కడైనా ఎవరికైనా ఎంత ధరకైనా అమ్ముకోవచ్చని మోడీ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చామని మరోసారి స్పష్టం చేశారు.

    ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రభుత్వం తయారీ రంగంపై దృష్టి సారించిందని.. ఈ రంగానికి ఊతమిచ్చేలా అనేక ప్రోత్సహాకాలు కల్పిస్తున్నామని మోడీ గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి వస్తువును భారత్ లో ఉత్పత్తి చేసి ఏ దేశంపై ఆధారపడకుండా చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని మోడీ సంచలన ప్రకటన చేశారు. మహమ్మారి సమయంలో భారత్ పై నమ్మకం ఉంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు.

    Also Read: క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్‌ కేథడ్రల్‌

    కార్పొరేట్ పన్నులను గణనీయంగా తగ్గించడంతో భారత్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని మోడీ అన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తున్నామని.. సరికొత్త ఆర్థిక వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రైవేటు రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో ఇప్పుడు భారత్ పై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరిగింది అని మోడీ చెప్పుకొచ్చాడు. సంస్కరణలతో భారత్.. ఆత్మనిర్భర్ భారత్ గా ఎదుగుతోందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ కు రికార్డు స్తాయిలో విదేశీ పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. సంస్కరణలతో అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కేంద్రంగా మారుతోందని మోడీ అన్నారు.

    ఒకప్పుడు ‘భారత్ ఎందుకు?’ అనుకున్న పెట్టుబడిదారులే.. ఇప్పుడు ‘భారత్ ఎందుకు కాకూడదు’ అనే స్థాయికి దేశం ఎదిగిందని ప్రధాని మోడీ కొనియాడారు. తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో భారత్ పై ప్రపంచ దృక్కోణం మారిందని మోడీ చెప్పుకొచ్చారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్