spot_img
Homeఅత్యంత ప్రజాదరణటీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ క్యాన్సర్..?

టీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ క్యాన్సర్..?

health tips of tea
మనలో చాలామంది టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనల్ని ఉత్సాహంగా ఉంచడంలో, అలసటను తగ్గించడంలో టీ ఎంతగానో సహాయపడుతుంది. కొంతమంది రోజుకు రెండుసార్లు టీ తాగితే మరి కొందరు మాత్రం ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, మంటను తగ్గించడం, గుండెజబ్బుల రిస్క్ తగ్గడం, ఇతర ప్రయోజనాలు  చేకూరుతాయి.
అయితే టీ మితంగా తాగితే ఏ ఇబ్బంది లేకపోయినా ఎక్కువసార్లు తాగితే మాత్రం ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా టీ తాగేవాళ్లలో నిద్రకు ఆటంకం కలుగుతుంది. వేడి టీ తాగడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఒక కప్పు టీ 150 డిగ్రీల ఫారెన్ హీట్‏లో ఉంటే 127 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు అన్నవాహిక ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో బాధ పడేవాళ్లు టీ తాగితే ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. టీలో లభించే టానిన్లు ఐరన్ శోషణకు కారణమవుతుంది కాబట్టి పరిమిత మొత్తంలో టీ తాగితే మంచిదని చెప్పవచ్చు. బ్లాక్ టీ, గ్రీన్ టీ శరీరంలో అసమతుల్యత, నిర్జలీకరణానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

టీ ఎక్కువగా తాగడం వల్ల హృదయ స్పందన సరిగ్గా లేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు పరిమితంగా టీ తాగడం లేదా నెమ్మదిగా ఆ అలవాటును తగ్గించుకోవడం చేస్తే మంచిది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version