https://oktelugu.com/

బంతిపూల సాగుతో లక్షల్లో లాభం పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే..?

దేశంలోని ఎన్నో రంగాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సామాన్యులతో పాటు ధనవంతులను సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోగా పట్టణాల్లో ఉన్నవాళ్లు సైతం పల్లెటూరు బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల కొంతమంది అర్హతకు తగని ఉద్యోగాలు సైతం చేస్తుండటం గమనార్హం. అయితే గ్రామాల్లో వ్యవసాయ భూమిని కలిగి ఉన్నవాళ్లు పూలను సాగుచేసి సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 26, 2021 8:47 pm
    Follow us on

    దేశంలోని ఎన్నో రంగాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సామాన్యులతో పాటు ధనవంతులను సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోగా పట్టణాల్లో ఉన్నవాళ్లు సైతం పల్లెటూరు బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల కొంతమంది అర్హతకు తగని ఉద్యోగాలు సైతం చేస్తుండటం గమనార్హం.

    అయితే గ్రామాల్లో వ్యవసాయ భూమిని కలిగి ఉన్నవాళ్లు పూలను సాగుచేసి సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో బంతిపూలను సాగు చేయడం ద్వారా ఎక్కువమొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా పండుగలు, వేడుకలు, శుభకార్యాల సమయంలో బంతిపూలను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. మెడిసిన్ల తయారీలో కూడా బంతిపూలను వినియోగించడం జరుగుతుంది.

    ఈ పూలను సాగు చేయడం ద్వారా సంవత్సరానికి ఏకంగా 15 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఎకరం పొలం ఉంటే బంతి పూలను సాగు చేస్తే ప్రతి వారం మూడు టన్నుల వరకు కోసే అవకాశం ఉంటుంది. మార్కెట్‏లో కేజీ పూల ధర రూ. 70 నుంచి రూ. 100 వరకు పొందే అవకాశం ఉంటుంది. ఈ పంట కోసం దాదాపు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    పెళ్లిళ్ల సీజన్ లో ఈ పూలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ పూలు 40 రోజుల తర్వాత వస్తాయి. బంతి పూల జ్యూస్ ను అగర్ బత్తీల తయారీలో, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో, క్యాన్సర్ ను నయం చేయడంలో వినియోగిస్తారు.