కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. చేయకూడని తప్పు ఇదే..?

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్లకు కరోనా పరీక్ష తప్పనిసరి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కరోనా సోకిన వాళ్లు పూర్తిగా కోలుకున్న తరువాతే టీకా తీసుకోవాలని సూచనలు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న […]

Written By: Navya, Updated On : May 18, 2021 12:16 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్లకు కరోనా పరీక్ష తప్పనిసరి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కరోనా సోకిన వాళ్లు పూర్తిగా కోలుకున్న తరువాతే టీకా తీసుకోవాలని సూచనలు చేస్తోంది.

కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వస్తే పూర్తిగా కోలుకున్న తరువాతే సెకండ్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా ప్రమాదమేనని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పాజిటివ్ నిర్ధారణ అవుతున్న కేసులు అరుదుగా నమోదవుతున్నాయి. మరోవైపు 2డీజీ ఔషధం ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది.

తొలి విడతగా పది వేల సాచెట్ల 2డీజీ ఔషధం ప్రజలకు అందుబాటులోకి రానుండటం గమనార్హం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ జూన్ నెలలో పూర్తిస్థాయిలో ఔషధం అందుబాటులోకి వస్తుందని చెబుతోంది. 2డీజీ సాచెట్ ధర 600 రూపాయలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2డీజీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని సమాచారం. 2డీజీ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే కరోనా మరణాల సంఖ్య తగ్గే అవకాశం అయితే ఉంటుంది.

దేశం మొత్తం కరోనాపై పని చేసే ఔషధం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2 డీజీ ఔషధం రెండో విడతలో భాగంగా ఈ నెల 27, 28 తేదీలలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.