కరోనాకు దివ్యౌషధం ఇదే.. ఏం చేయాలంటే..?

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మినహా మరో మార్గం లేదు. అయితే యోగా నిపుణులు మాత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగా చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. యోగాను జీవన విధానంలో భాగం చేసుకోగలిగితే కరోనా వైరస్ సోకదని వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రాణాయామంలోని ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ […]

Written By: Navya, Updated On : May 15, 2021 10:23 am
Follow us on


ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మినహా మరో మార్గం లేదు. అయితే యోగా నిపుణులు మాత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగా చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. యోగాను జీవన విధానంలో భాగం చేసుకోగలిగితే కరోనా వైరస్ సోకదని వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.

ప్రతిరోజూ ప్రాణాయామంలోని ప్రక్రియలను పూర్తి చేయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. కరోనా వచ్చినప్పుడే యోగాను జీవన విధానంలో భాగం చేసుకుంటే మంచిది. పిల్లలు, పెద్దలు ప్రాణాయామం చేయడం ద్వారా కరోనాతో పాటు అనేక రుగ్మతల నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

అష్ఠాంగ యోగంలో ప్రాణాయామం ఒక భాగమని ప్రాణాయామం చేయగలిగితే ఊపిరితిత్తులు బాగా బలపడి మనిషి 100 యేళ్ల కన్నా ఎక్కువ జీవించే అవకాశాలు ఉంటాయని యోగా నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా బాధితులు సైతం యోగా చేయవచ్చని చేతి వేళ్లను మార్చుకుంటూ ముద్రలను చేసుకున్నట్లయితే తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముద్రలు వేస్తే ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని . మధ్యమ ప్రాణాయామం చేయగలిగితే కరోనా రోగులు ఆక్సిజన్‌ రేటు పెంచుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. వర్ణముద్ర, అగ్ని వాయు ముద్ర, ప్రాణ ముద్ర, లింగ ముద్రల వల్ల జలుబు, జ్వరం, దగ్గు తగ్గుతాయని వెల్లడిస్తున్నారు.