ఏపీ హైకోర్టు తీర్పులు.. వాటిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల విషయంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. హైకోర్టు తీర్పులు నచ్చకపోతే సుప్రీం కోర్టు కెళ్లాలంటూ తమ్మినేనిని హెచ్చరించింది. బహిరంగంగా మాట్లాడడం ఏంటని నిలదీసింది.
Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. మధ్యలో పవన్..!
న్యాయస్థానాలపై మీడియా, సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారం సైతం హైకోర్టు తీర్పులపై కామెంట్ చేశాడు. ఇంకొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యి కేసులు పెట్టమని ఆదేశించినా వైసీపీ సర్కార్ కేసులు పెట్టలేదు.
దీనిపై హైకోర్టు ఆగ్రహించింది. నేతలను రక్షించేందుకే కేసు పెట్టలేదా అని వైసీపీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో సీఐడీ విఫలమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామంది. హైకోర్టు తీర్పులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై రిజిస్ట్రార్ ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అటు స్పీకర్ తమ్మినేని ఎక్కడ నుంచి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రభుత్వ లాయర్ ను కోరింది.
Also Read: ప్చ్.. దసరాకు బస్సులు లేనట్లేనా?
ఇలా వైసీపీ నేతల వ్యాఖ్యలు.. దానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని.. ఈ విషయంలో చర్యలు తీసుకోకుంటే సీబీఐ విచారణకు ఆదేశిస్తామంటూ హైకోర్టు హెచ్చరించడం సంచలనమైంది. అయితే సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. దీంతో తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది.