https://oktelugu.com/

దిల్ రాజుకు హ్యాండిచ్చిన మహేష్ బాబు? ఏమైంది?

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు మంచి పేరుంది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నీ కూడా హిట్ టాక్ దక్కించుకున్నావే. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ బాగుండటం వల్లే ఆయన నిర్మించాలనే సినిమాలన్నీ దాదాపుగా హిట్టు అవుతుంటాయనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో ఉంది. Also Read: బిగ్ బాస్-4: ఆమె లాగే వెళ్లిపోతావా.. నాగార్జున వార్నింగ్.. స్వాతి దీక్షిత్ ఫైర్ దిల్ రాజు ప్రస్తుతం పవన్ కల్యాణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 04:15 PM IST
    Follow us on

    టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు మంచి పేరుంది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నీ కూడా హిట్ టాక్ దక్కించుకున్నావే. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ బాగుండటం వల్లే ఆయన నిర్మించాలనే సినిమాలన్నీ దాదాపుగా హిట్టు అవుతుంటాయనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో ఉంది.

    Also Read: బిగ్ బాస్-4: ఆమె లాగే వెళ్లిపోతావా.. నాగార్జున వార్నింగ్.. స్వాతి దీక్షిత్ ఫైర్

    దిల్ రాజు ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ‘వకీల్ సాబ్’ మూవీని శ్రీదేవి భర్త బోనికపూర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే మహేష్ తో ఓ మూవీ చేయాలని దిల్ రాజు భావించాడు. అయితే దర్శకుడు వంశీపైడిపల్లి సరైన కథను సిద్ధం చేయకపోవడంతో సినిమా పట్టాలెక్కలేదు. ఇదే విషయంలో ఇటీవల దిల్ రాజు మహేష్ ను కలిసి తనతో ఓ సినిమా చేయాలని కోరినట్లు సమాచారం.

    అయితే దిల్ రాజు ప్రతిపాదనకు మహేష్ నుంచి సానుకూల స్పందన రాలేదనే తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం పర్శురాం దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ చేస్తున్నారు. ఆ వెంటనే త్రివిక్రమ్ లేదా రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉంది. దీంతో దిల్ రాజుకు సినిమా విషయంలో మహేష్ హామీ ఇవ్వలేకపోయాడని టాక్ విన్పిస్తోంది.

    ఇక వంశీపైడి-రాంచరణ్ కాంబోలో ఓ మూవీ నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అయితే అది కూడా వర్కౌట్ కావడం లేదట. మరోవైపు దర్శకుడు దశరథ్ ను దిల్ రాజు ప్రభాస్ వద్దకు పంపించి సినిమా కోసం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో దశరథ్ తో ప్రభాస్ కు సినిమా చేసిన అనుభవం ఉంది.

    Also Read: టీవీ ఛానల్ కు భారీ షాకిచ్చిన ‘నిశబ్ధం’ టీమ్

    ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వరల్డ్ వైడ్ అయింది. అంతేకాకుండా ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులకు కమిటై ఉన్నారు. ఈ నేపథ్యంలో దశరథ్ సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వరుసగా స్టార్ హీరోలంతా దిల్ రాజుకు హ్యాండిచ్చినట్లే కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు నెక్ట్ సినిమా ఏ హీరోతో నిర్మిస్తారనేది ఆసక్తికరంగా మారింది.