https://oktelugu.com/

బిగ్ బాస్-4: ఆమె లాగే వెళ్లిపోతావా.. నాగార్జున వార్నింగ్.. స్వాతి దీక్షిత్ ఫైర్

గడిచిన ఐదు వారాలుగా బిగ్ బాస్-4 స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ఈ బిగ్ బాస్-4 తొలి నుంచి మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. అయితే క్రమంగా బిగ్ బాస్ అదిరిపోయే టాస్కులు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్-4 హౌస్ లో ఉన్న కంటెస్టులు అలరిస్తున్నారా? లేదా అన్నది పక్కన పెడితే.. ఎలిమినేషన్ గురై బయటికి వస్తున్న వారిపైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. Also Read: దిల్ రాజుకు హ్యాండిచ్చిన మహేష్ బాబు? ఏమైంది? […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 03:44 PM IST
    Follow us on

    గడిచిన ఐదు వారాలుగా బిగ్ బాస్-4 స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ఈ బిగ్ బాస్-4 తొలి నుంచి మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. అయితే క్రమంగా బిగ్ బాస్ అదిరిపోయే టాస్కులు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్-4 హౌస్ లో ఉన్న కంటెస్టులు అలరిస్తున్నారా? లేదా అన్నది పక్కన పెడితే.. ఎలిమినేషన్ గురై బయటికి వస్తున్న వారిపైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

    Also Read: దిల్ రాజుకు హ్యాండిచ్చిన మహేష్ బాబు? ఏమైంది?

    ఇటీవల బిగ్ బాస్-4 నుంచి ఎలిమినేషన్ కు గురైన కంటెస్టులు చేస్తున్న ఆరోపణలు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో సీజన్లలో ప్రేక్షకులంతా బిగ్ బాస్ హౌస్ లో జరిగే విషయాలపై ఎక్కువగా చర్చించుకునేవారు. అయితే ప్రస్తుత సీజన్లో పాల్గొన్న కంటెస్టులు పెద్దగా ఎవరికీ తెలియదు. ఒకరిద్దరు మినహా మిగతావారెవరూ కూడా వారికి వారు పరిచయం చేసుకుంటే తప్ప ప్రేక్షకులకు తెలియనివారే ఉన్నారు.

    అయితే బిగ్ బాస్-4 నుంచి ఎలిమేషన్ గురైనవారు షోపై కాంట్రావర్సీ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి తొలి ఎలిమినేటర్ గా బయటికి వచ్చిన దర్శకుడు సూర్యప్రకాశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ ప్రస్తుత సీజన్లో అమ్మ రాజశేఖర్ మినహా సినిమావాళ్లు ఎవరు లేరంటూ బాంబు పేల్చాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి కూడా అదే విషయాన్ని చెప్పడంతోపాటు బిగ్ బాస్ షోపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

    ఇక తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స్వాతిదీక్షిత్ కేవలం వారం వ్యవధిలోనే ఎమిలినేషన్ కు గురైంది. ఆమె అల్లరి నరేష్ నటించిన ‘జంప్ జిలానీ’ చిత్రం నటించింది. అయితే ఆమెను అంత తొందరగా ఎలిమినేషన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతోపాటు నామినేషన్ ప్రక్రియ.. ఓటింగ్ సరళిపై చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎంటటైన్మెంట్ చేయకుండా స్వాతిలాగే అందరూ బయటికి వెళ్లాల్సి వస్తోందని హోస్టు నాగార్జున కంటెస్టులకు తాజాగా వార్నింగ్ కూడా ఇచ్చాడు.

    Also Read: టీవీ ఛానల్ కు భారీ షాకిచ్చిన ‘నిశబ్ధం’ టీమ్

    నాగార్జున వ్యాఖ్యలపై స్వాతిదీక్షిత్ మండిపడింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు తాను చేయాల్సిన ప్రయత్నం చేయకపోయి ఉంటే నాగార్జున మాటలను స్వీకరించే ఉండేదనని చెప్పుకొచ్చింది. తాను ఇంటిలో ఉండేందుకు ప్రయత్నం చేశానని అయితే తాను బిగ్ బాస్ లో ఎంటటైన్మెంట్ చేసిన వాటిని షో నిర్వాహాకులు ఎడిటింగులో తీసేశారని చెప్పుకొచ్చింది. తాను ఎంటైన్మెంట్ చేసిన దాంట్లో కనీసం 5శాతం కూడా చూపించిన బాగుండేదని చెప్పింది. ఇక నాగార్జున తన గురించి అలా మాట్లాడం సరికాదని హితవు పలికింది. ఆమె ఆరోపణల నేపథ్యం బిగ్ బాస్ ఓటింగ్.. నామినేషన్ ప్రక్రియపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.