https://oktelugu.com/

మాజీ ఎంపీకి తీరని శోకం.. రెండో కొడుకూ మృతి

టీడీపీ మాజీ ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎంపీ తన ఇద్దరు కుమారులను ఒక నెల వ్యవధిలో కోల్పోయారు. ఎంపీ చిన్న కొడుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో తుదిశ్వాస విడిచారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఏలూరు ఎంపి మాగంటి బాబు చిన్న కుమారుడు రవీంద్రనాథ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో చనిపోయాడు. మీడియా నివేదికల ప్రకారం.. బాధితుడు మద్యానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2021 / 02:02 PM IST
    Follow us on

    టీడీపీ మాజీ ఎంపీ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎంపీ తన ఇద్దరు కుమారులను ఒక నెల వ్యవధిలో కోల్పోయారు. ఎంపీ చిన్న కొడుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో తుదిశ్వాస విడిచారు.

    టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఏలూరు ఎంపి మాగంటి బాబు చిన్న కుమారుడు రవీంద్రనాథ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో చనిపోయాడు.

    మీడియా నివేదికల ప్రకారం.. బాధితుడు మద్యానికి బానిస అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారట.. అతడు ఆ ఆస్పత్రి నుండి తప్పించుకొని హోటల్ లో ఉంటున్నట్లు సమాచారం.

    బాధితుడిని హోటల్ సిబ్బంది సంప్రదించినప్పుడు స్పందించకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు హోటల్‌కు చేరుకుని హోటల్ గది తలపులు పగులకొట్టి చూడగా.. బాధితుడు చనిపోయినట్లు గుర్తించారు.

    మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ గా అతడిని గుర్తించారు. బంజారా హిల్స్ పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.

    మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు పెద్ద కుమారుడు మాగంటి రామ్‌చంద్రన్ ఈ ఏడాది మార్చిలో తుది శ్వాస విడిచారు. రామ్‌చంద్రన్ మృతిని ఇప్పటికీ కుటుంబం జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో ఆయన రెండో కుమారుడు రవీంద్రనాథ్ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. మద్యానికి బానిస కావడంతో ఆస్పత్రిలో చేర్పించారని.. అక్కడి నుంచి చికిత్స పొందకుండా బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడని మీడియాలో ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలు పోస్టుమార్టం అనంతరం తెలుస్తుంది.