
అమర వీరుల ఆశయ సాధనకు విరుద్ధంగా తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కల్వ కుంట్ల, ఒవైసీ కుటుంబాలే అబ్ధి పొందాయని ఆరోపించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో భాజపాలో చేరే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఆయన వివరించారు.