https://oktelugu.com/

ఆ ఎమ్మెల్యేలపై జగన్ సర్వే.. టికెట్లు కష్టమేనట!

  వైఎస్ జగన్ నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. ఆయా నియిజకవర్గాల్లోని గ్రూపు రాజకీయాలపై పోస్టుమార్టం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలపై సర్వే చేసిన జగన్ ఆ నలుగురు ఎమ్మెల్యేల పనితీరు అధ్వానంగా ఉందని.. కుమ్ములాటలతో దారుణంగా తయారైందని.. ఇలానే ఉంటే వారికి టికెట్లు కష్టమేనని తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లాలోని వైసీపీలో గ్రూపులు, తగాదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటున్నారు. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఏకంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2021 / 01:51 PM IST
    Follow us on

     


    వైఎస్ జగన్ నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. ఆయా నియిజకవర్గాల్లోని గ్రూపు రాజకీయాలపై పోస్టుమార్టం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వైసీపీలో విభేదాలపై సర్వే చేసిన జగన్ ఆ నలుగురు ఎమ్మెల్యేల పనితీరు అధ్వానంగా ఉందని.. కుమ్ములాటలతో దారుణంగా తయారైందని.. ఇలానే ఉంటే వారికి టికెట్లు కష్టమేనని తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

    గుంటూరు జిల్లాలోని వైసీపీలో గ్రూపులు, తగాదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటున్నారు. జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఏకంగా 15 సీట్లను గెలుచుకుంది. ఇక్కడున్న 3 ఎంపీ సీట్లలో రెండింటిని వైసీపీ కైవసం చేసుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న వైసీపీలో ఇప్పుడు వర్గపోరు తప్పడం లేదు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసిన నేతల మధ్య కోల్డ్ వార్ పెరిగినట్లు నేతలు చర్చించుకుంటున్నారు. ఓ నియోజకవర్గ మహిళ నేతపై ఏకంగా వైసీపీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం.. ఆమె ఎంపీతోనే తగువు పెట్టుకోవడం పార్టీలో రచ్చకు కారణమైంది.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచింది. టీడీపీ కంచుకోటలు కూడా బద్దలై వైసీపిక పట్టం కట్టారు. ఆది నుంచి టీడీపీకి ఆయువు పట్టు అయిన ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కూడా టీడీపీ కొట్టుకుపోయి వైసీపీ విజయదుందుభి మోగించింది. అయితే గెలిచిన రెండేళ్లలోనే గుంటూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రమైందట.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందట..

    గుంటూరు జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల అంతర్గత పోరుపై గుర్రుగా ఉన్న జగన్ ఇటీవలే సర్వే నిర్వహించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ ద్వారానూ పరిస్థితి తెలుసుకున్నాడట.. ఇందులో నలుగురు ఎమ్మెల్యేల తీరు ఘోరంగా ఉందని.. వారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిత్తుగా ఓడిపోతారని తేలిందట.. వచ్చేసారి కూడా వారికి టికెట్ ఇస్తే పార్టీ ఘోరంగా ఆ నియోజకవర్గాల్లో ఓడిపోతుందని తేలిందట..

    దీంతో సీఎం జగన్ ఇప్పుడు ఆ నలుగురిపై సీరియస్ అయినట్టు సమాచారం. వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు గ్రూపు తగాదాలు పరిష్కరించాలని.. అవన్నీ సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని జగన్ స్పష్టం చేసినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది.

    జగన్ గురిపెట్టిన ఆ నలుగురు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? వారు ఎందుకు వెనుకబడ్డారు? ఆ గ్రూపు తగాదాలు ఏంటనే దానిపై జిల్లాలో జోరుగా సాగుతోంది. వారి వల్ల పార్టీకే చెడ్డ పేరు వస్తుందని తెలియడంతోనే జగన్ రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

    ఇక జగన్ ను విమర్శించే వారిపై ఒంటికాలిపై లేచే సన్నిహితుడైన ఎమ్మెల్యే సైతం ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఉన్నాడట.. ఇక పోయిన సారి సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే పనితీరు కూడా బాగా లేదని అంటున్నారు. జగన్ ఈ నలుగురు ఎమ్మెల్యేల పనితీరు, అంతర్గత కుమ్ములాటలు సరిచేసుకోకపోతే వచ్చేసారి టికెట్ ఇవ్వనని స్పష్టం చేసినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది.