కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ లోనూ.. యూకేకు భారత విమానాలు..!

కొత్త ఏడాదికి ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచానికి పెద్ద సవాల్ విసిరింది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆయా దేశాల్లో విజృంభిస్తుండటం ఆందోళన రేపుతోంది. కరోనా వైరస్ కంటే 70శాతం అధికంగా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు క్రమంగా మిగతా దేశాల్లో నమోదవుతుండటంతో అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలోనే భారత్ సైతం బ్రిటన్ కు విమాన సర్వీసులను […]

Written By: Neelambaram, Updated On : January 1, 2021 9:23 pm
Follow us on


కొత్త ఏడాదికి ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచానికి పెద్ద సవాల్ విసిరింది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆయా దేశాల్లో విజృంభిస్తుండటం ఆందోళన రేపుతోంది.

కరోనా వైరస్ కంటే 70శాతం అధికంగా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు క్రమంగా మిగతా దేశాల్లో నమోదవుతుండటంతో అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఈక్రమంలోనే భారత్ సైతం బ్రిటన్ కు విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. జనవరి 7వరకు యూకేకు సర్వీసులను నిలిపివేయనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

జనవరి 8 నుంచి భారత్.. యూకే మధ్య విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. భారత్.. బ్రిటన్ మధ్య ఈనెల 23వరకు సర్వీసులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

భారత్ లోని ఢిల్లీ.. ముంబై.. బెంగళూరు.. హైదరాబాద్ నుంచి మాత్రమే బ్రిటన్ కు విమాన సర్వీసులు నడువనున్నాయి. రెండు దేశాల మధ్య వారానికి 15 విమాన సర్వీసులు నడుస్తాయని డీజీఏసీ పేర్కొంది.

ఇదిలా ఉంటే జనవరి 31న విదేశీ విమాన సర్వీసులపై కేంద్రం గతంలోనే ఆంక్షలు విధించింది. అయితే ప్రత్యేక విమాన సర్వీసులకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. ప్రస్తుతం భారత్ లో 29 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.