ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా..

దేశంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఈసీ రంగం సిద్ధం చేశారు. దీంతో దేశంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. Also Read: డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు అతిత్వరలో ఎన్నికల నగారా మోగనుంది. […]

Written By: Srinivas, Updated On : February 10, 2021 11:32 am
Follow us on


దేశంలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఈసీ రంగం సిద్ధం చేశారు. దీంతో దేశంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది.

Also Read: డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది..

దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు అతిత్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల మూడోవారం లేదా.. నాలుగోవారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఇక దేశంలో మరోసారి హడావుడి మొదలు కానుంది. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అతిపెద్ద రెండు కీలక రాష్ట్రాలు ఇందులో ఉన్న సంగతి తెలిసిందే..

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి దగ్గర పడింది. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి ఈసీ ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. వీటిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల గురించి యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే ఇందుకు కారణం..

Also Read: ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?

కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధత, తదితర అంశాలు పరిశీలించింది. అతిత్వరలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బృందం పర్యటించనుంది. ఆరు రోజుల పాటు అధికారులు ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే షెడ్యూల్ విడుదల కాకుముందే.. ఆయా రాష్ట్రాల్లో రాజకీయం రాజుకుంటోంది. ఇప్పటికే అస్సాంలో పర్యటించిన మోదీ.. విపక్షాలే టార్గెట్ గా తనదైన శైలిలో మాటల బాణాలు సంధించారు. టీ తోటల కార్మికులకు అనుకూలంగా మాట్లాడి ఓటుబ్యాంకును పెంచుకునే ప్రయత్నం ప్రారంభించారు. తమిళనాట శశికళ రంగంలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ.. బీజేపీకి వైరం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు హాట్ టాఫిక్ గా మారాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్