Dalit Girl Raped : బడిలోకి లాక్కెళ్లి బాలికపై యువకుడి అత్యాచారం..

Dalit Girl Raped: బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. చట్టాలెన్ని ఉన్నా అవి వారిని కాపాడడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలొచ్చినా వారిని ఆదుకోవడం లేదు. ఎక్కడో ఓ చోట అత్యాచార (Rape) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. బాలికలు కనిపిస్తే చాలు వారిపై అఘాయిత్యాలు చేయడమే పరిపాటి. ఈ నేపథ్యంలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి రక్షణ కల్పించడమే తమ లక్ష్యంగా పోలీసులు చెబుతున్నా అవి ఆచరణలో […]

Written By: Srinivas, Updated On : September 6, 2021 10:58 am
Follow us on

Dalit Girl Raped: బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. చట్టాలెన్ని ఉన్నా అవి వారిని కాపాడడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలొచ్చినా వారిని ఆదుకోవడం లేదు. ఎక్కడో ఓ చోట అత్యాచార (Rape) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. బాలికలు కనిపిస్తే చాలు వారిపై అఘాయిత్యాలు చేయడమే పరిపాటి. ఈ నేపథ్యంలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వారికి రక్షణ కల్పించడమే తమ లక్ష్యంగా పోలీసులు చెబుతున్నా అవి ఆచరణలో కనిపించడం లేదు. దీంతో వారి మనుగడ ప్రశ్నాకర్థకంలో పడిపోతోంది. సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ దళిత బాలిక (Dalit Girl) తన అమ్మమ్మ ఇంటిలో ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు.

అదను కోసం నక్కలా వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో అతడికి ఆ అవకాశం రానే వచ్చింది. ఇంట్లో వారందరు ఉత్సవాల్లో మునిగిపోయారు. బాలిక ఒంటరిగా అతడి కంట కనిపించింది. దీంతో మెల్లగా బాలికను బలవంతంగా పాఠశాలలోకి లాక్కెళ్లాడు. తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు.

దీంతో షాక్ కు గురైన బాలిక జరిగిన విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. దీంతో ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు అనుమానం వచ్చి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. రక్తస్రావం జరగడంతో గమనించిన కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించారు. విషయం తెలియడంతో తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేశారు.

ఇలా బాలికలపై అత్యాచారాల ఘటనలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలియని వయసులో ఇలా జరగడంతో వారికి భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. ఎవరిని చూసినా భయంతో వణికిపోతారు. చట్టాలెన్ని ఉన్నా వారిని కాపాడేవి ఏమి లేవని తెలుసుకుని లోపలే మథనపడుతున్నారు. జరిగిన హఠాత్ పరిణామానికి నివ్వెరపోతున్నారు. బాలికల రక్షణకు ప్రభుత్వం ఇంకా ఏం చట్టాలు తీసుకొస్తుందో కాని వారిని మాత్రం రక్షించడం లేవని తెలుస్తోంది.