పారాలింపిక్స్ లో ఇండియాకు మరో రెండు మెడల్స్ దక్కాయి. షూటర్ మనీశ్ నర్వాల్ ఇవాళ జరిగిన ఈవెంట్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పీ4 మిక్స్ డ్ 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్ లో మనీశ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. టాప్ లో నిలిచిన అతను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే ఈ వెంట్ లో సింఘరాజ్ కు సిల్వర్ మెడల్ దక్కడం విశేషం.