https://oktelugu.com/

గుడ్ న్యూస్: దేశంలో కరోనా టీకాల పంపిణీ ఇప్పటినుంచే..

కేంద్రంలోని మోడీ సర్కార్ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది.. గత మార్చి నుంచి దేశాన్ని పట్టుకున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే బ్రహ్మాస్త్రం రెడీ అయ్యింది. ఏడాది కాలంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసి.. ఎంతో మందిని చంపిన మహమ్మారి కరోనాకు విరుగుడు సాధ్యమైంది. Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకపోయినా..? కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేసింది. ప్రజలను కరోనా నుంచి విముక్తి కల్పించే ఈ కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 / 09:33 PM IST
    Follow us on

    కేంద్రంలోని మోడీ సర్కార్ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది.. గత మార్చి నుంచి దేశాన్ని పట్టుకున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే బ్రహ్మాస్త్రం రెడీ అయ్యింది. ఏడాది కాలంలో ఎందరో జీవితాలను తలకిందులు చేసి.. ఎంతో మందిని చంపిన మహమ్మారి కరోనాకు విరుగుడు సాధ్యమైంది.

    Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకపోయినా..?

    కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేసింది. ప్రజలను కరోనా నుంచి విముక్తి కల్పించే ఈ కరోనా వ్యాక్సిన్లను ఇప్పుడు ప్రజలకు పంపిణీ చేయడానికి రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ప్రజలకు పెద్ద ఎత్తున టీకాలను వేసే కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం సిద్ధమైంది.

    దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో తొలుత మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు ఇవ్వనున్నారు.

    Also Read: ప్రతి సంవత్సరం 100 మంది సైనికులు ఆత్మహత్య.. కారణమేమిటంటే..?

    తర్వాత 27 కోట్ల మంది 50 ఏళ్ల పైబడిన లేదా.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి ఈ టీకా అందించనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించామని కేంద్రం ప్రకటన చేసింది.

    కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్రమోడీ సమీక్ష చేసిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ టీకా పంపిణీ చేయనున్నారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్, ఆక్స్ ఫర్-సీరం వారి కోవిషీల్డ్ టీకాలను కేంద్రం దేశ ప్రజలకు ఇవ్వనుంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటగా చెప్పొచ్చు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్