https://oktelugu.com/

పిల్లలే పెళ్లి పెద్దలుగా సింగర్ సునీత పెళ్లి

నిజానికి తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లను దగ్గరుండి చేస్తారు. అదే పద్ధతి. కానీ సంసారంలో ఒడిదుడుకులతో విడాకులు తీసుకొని పిల్లలను పెంచి పెద్ద చేసిన గాయని సునీత వివాహాన్ని ఆమె ఇద్దరు పిల్లలు దగ్గరుండి జరిపించడం విశేషం. Also Read: ‘రియా చక్రవర్తి’ మళ్ళీ ప్రేమలో పడిందా ? పిల్లలు తోడుగా ఉండగా పెళ్లి కూతురుగా రెడీ అయిన సింగర్ సునీత తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పాటలతో ఎంతోమంది […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 / 09:04 PM IST
    Follow us on

    Singer Sunitha Wedding

    నిజానికి తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లను దగ్గరుండి చేస్తారు. అదే పద్ధతి. కానీ సంసారంలో ఒడిదుడుకులతో విడాకులు తీసుకొని పిల్లలను పెంచి పెద్ద చేసిన గాయని సునీత వివాహాన్ని ఆమె ఇద్దరు పిల్లలు దగ్గరుండి జరిపించడం విశేషం.

    Also Read: ‘రియా చక్రవర్తి’ మళ్ళీ ప్రేమలో పడిందా ?

    పిల్లలు తోడుగా ఉండగా పెళ్లి కూతురుగా రెడీ అయిన సింగర్ సునీత తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    తన పాటలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే నేడు సునీత వివాహం చేసుకుంది. సంప్రదాయబద్ధంగా పెళ్లి కూతురు అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది.

    Also Read: నేడు సింగర్ సునీత పెళ్లి.. హనీమూన్ కోసం మాల్దీవులకు.. !

    సునీతకు 19 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తలెత్తడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్