https://oktelugu.com/

క్రికెట్ లో దారుణం.. భారత క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ల జాత్యంహకారం

భారత్ తో టెస్ట్ సిరీస్ లో నేరుగా తలపడలేక ఆస్ట్రేలియా టీంతోపాటు ఆ దేశ క్రికెట్ అభిమానులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియతో భారత్ టెస్ట్ సిరీస్ లో మూడో మ్యాచ్ లో ప్రేక్షకులు రెచ్చిపోయారు. Also Read: మరో రికార్డుకు చేరువలో ధోనీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. రెండో రోజు, మూడో రోజు ఆటలోనూ ఆటగాళ్లకు ఇలాంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 / 09:45 PM IST
    Follow us on

    భారత్ తో టెస్ట్ సిరీస్ లో నేరుగా తలపడలేక ఆస్ట్రేలియా టీంతోపాటు ఆ దేశ క్రికెట్ అభిమానులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియతో భారత్ టెస్ట్ సిరీస్ లో మూడో మ్యాచ్ లో ప్రేక్షకులు రెచ్చిపోయారు.

    Also Read: మరో రికార్డుకు చేరువలో ధోనీ

    బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. రెండో రోజు, మూడో రోజు ఆటలోనూ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సిరాజ్, బుమ్రాలను అభ్యంతరకర పదజాలంతో దూషించారు.

    దీనిపై కెప్టెన్ అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ తదితర సీనియర్ ఆటగాళ్లు ఇద్దరు అంపైర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇక టీమిండియా మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఐసీసీ దీన్ని తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తునకు రెడీ అయ్యింది. వెంటనే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తోంది.

    Also Read: 3వ టెస్ట్: పట్టుబిగించిన ఆస్ట్రేలియా.. ఇండియా నిలబడుతుందా?

    ఇలాంటి వర్ణ వివక్ష దారుణమని.. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పేర్కొంది. దీనిపై ఆస్ట్రేలియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచిచూడాలి.