https://oktelugu.com/

అందరికీ షాకిచ్చిన స్టార్ హీరోయిన్

కొత్త సంవత్సరం వేళ అందరూ కొత్త టార్గెట్లు పెట్టుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అలా చేయకూడదని కొత్త దారిలో వెళతారు. కానీ మన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెటిజన్లు అందరికీ షాకిచ్చారు. Also Read: శాకుంతలగా సమంత.. మరో బిగ్ ఆఫర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లోని తన పాత పోస్టులన్నీ డిలీట్ చేసి సంచలనం సృష్టించారు. దీపిక […]

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2021 / 09:28 PM IST
    Follow us on

    కొత్త సంవత్సరం వేళ అందరూ కొత్త టార్గెట్లు పెట్టుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అలా చేయకూడదని కొత్త దారిలో వెళతారు. కానీ మన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెటిజన్లు అందరికీ షాకిచ్చారు.

    Also Read: శాకుంతలగా సమంత.. మరో బిగ్ ఆఫర్

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లోని తన పాత పోస్టులన్నీ డిలీట్ చేసి సంచలనం సృష్టించారు. దీపిక వివిధ సందర్భాల్లో ఎన్నో వివాదాస్పద పోస్టులు పెట్టారు. అవన్నీ పెద్ద వివాదమయ్యాయి. అప్పట్లో సీఏఏకు వ్యతిరేకంగా స్పందించి బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యారు.

    అయితే కొత్త సంవత్సరం 2021 వేళ పాత పోస్టులన్నీ డిలీట్ చేయడం సంచలనమైంది. దీపికకు ఏమైందని అందరూ ఆరాతీశారు. కామెంట్లతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే ఆమె దానికి గల కారణం తెలిపారు.

    Also Read: 2021 డైరీ: ఈ సినిమాల‌పైనే బోలెడు ఆశలు !

    2021 నూతన సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. నా సోషల్ మీడియా ఖాతాలోని పోస్టులన్నీ డిలీట్ చేసి పాత అనుభవాలు, గుణపాఠాలను తొలగించి ఫ్రెష్ గా స్ట్రాట్ చేస్తున్నట్టు తెలిపారు.

    ఏకంగా ట్విట్టర్ లో 27 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 52 మిలియన్ల ఫ్యాన్స్ ఉన్నా దీపిక తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్