గ్రేటర్ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే వరద సాయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎన్నికల ముందు ప్రభుత్వం హడావుడిగా కొన్ని ఏరియాల్లో వరద సాయం పంపిణీ చేసింది. దీంతో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా వరదసాయంపై ఎలక్షన్ కోడ్ విధించింది.
Also Read: తిరుపతి బైపోల్: పవన్, బీజేపీ పొత్తు పొడిచేలా లేదే?
దీంతో మధ్యలోనే వరదసాయం నిలిచిపోయింది. అయితే మీసేవాలో బాధితులు ధరఖాస్తు చేసుకుంటే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి వరద సాయం పంపిణీ చేస్తామంటూ హమీ ఇచ్చారు.
వరద బాధితులు నిన్నంత మీసేవా కేంద్రాల ఎదుట పడిగాపులు పడ్డారు. పెద్దసంఖ్యలో జనం రావడంతో మీసేవా కేంద్రాల నిర్వాహాకులు బెంబెలెత్తిపోయి మూసివేశారు. దీంతో వరదసాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రావద్దని బాధితుల అకౌంట్లలోనే నగదు వేస్తామని చెప్పారు.
Also Read: 505కు చేరిన ఏలూరు బాధితులు.. వింతవ్యాధికి కారణమిదే..
జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యాఖ్యల నేపథ్యంలో బాధితులంతా సీఎం క్యాంపస్ ఆఫీసుకు తరలివెళ్లి ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అలాగే కొన్ని ఏరియాల్లో కార్పొరేటర్ల ఇళ్లను బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించినా సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వరదసాయం కోసం బాధితులు నిన్నంతా ఆందోళనలు చేపట్టిన కార్పొరేటర్లు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కొత్త.. పాత కార్పొరేటర్లు ఎవరూ కూడా తమను పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. వరదసాయం 25వేలు ఇస్తామన్న బీజేపీ కూడా బాధితుల పక్షాన పోరాడటం లేదని ఆరోపించారు.ఎన్నికలు ముగియడంతో అసలు వరద సాయం ఇస్తారా? ఇవ్వారా? అని తెలియక జనం అయోమయం చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్