https://oktelugu.com/

ఉప్పెన’ రిలీజ్ ఎప్పుడంటే… అది మెగా ఇమేజ్ కే సాధ్యం !

స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే.. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ హీరో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, ఆ హీరో ఎలా ఉన్నాడు, అతగాడి నటన ఎలా ఉంది.. హీరోగా పనికొస్తాడా.. లేదా.. ఒకవేళ ఆ కొత్త హీరో నటన బాగుంటే చాలు, ఇక అతన్ని స్టార్ ను చేసేస్తారు అభిమానులు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారుసల నుండి వచ్చే స్ట్రోక్స్ దెబ్బకు మహామహులే కుదలైపోయిన […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 10:21 AM IST
    Follow us on


    స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే.. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ హీరో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు, ఆ హీరో ఎలా ఉన్నాడు, అతగాడి నటన ఎలా ఉంది.. హీరోగా పనికొస్తాడా.. లేదా.. ఒకవేళ ఆ కొత్త హీరో నటన బాగుంటే చాలు, ఇక అతన్ని స్టార్ ను చేసేస్తారు అభిమానులు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో వారుసల నుండి వచ్చే స్ట్రోక్స్ దెబ్బకు మహామహులే కుదలైపోయిన మాట వాస్తవం. అందుకే చాలామంది ప్రముఖులు తమ వారసులను ఇండస్ట్రీకి తీసుకురారు. కానీ మెగా ఫ్యామిలీ అందుకు విరుద్ధం. ఇప్పటికే అరడజను మందిని హీరోలను చేసింది మెగా ఇమేజ్. ఇప్పుడు కొత్తగా మరో హీరో వస్తున్నాడు. ఈ క్రెడిట్ ఒక్క మెగా ఇమేజ్ కే సాధ్యం అయింది.

    Also Read: ‘బిగ్ బాస్ 4’ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ ఫిక్స్ !

    అతనే మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్. ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతున్న వైష్ణ‌వ్‌ తేజ్ మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే మంచి క్రేజ్ ను సాధించాడు. అయితే `ఉప్పెన` సినిమా విడుదల ఎప్పుడు? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చిత్రబృందాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ టైమ్‌కు కరోనా అంతా సర్దుకుంటుందని, అప్పుడే `ఉప్పెన` సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. కాగా బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుంది.

    Also Read: నిహారిక పెళ్లి విశేషాలు.. ప్రత్యేక ఆహ్వానితుల్లో ఇద్దరు హీరోయిన్స్ !

    ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. ఇక ఈ సినిమా పాయింట్ కి వస్తే డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. కొట్టి భయపెట్టినా తన ప్రేమను వదిలిపెట్టట్లేదని ఏకంగా ఆ హీరో మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారని.. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే సరికి ఈ సినిమా పై తమిళంలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అన్నట్లు ఆల్ రెడీ వైష్ణ‌వ్‌ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్