ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఫ్లిప్ కార్ట్ తీసుకున్న నిర్ణయం ద్వారా భారీగా ప్రయోజనం చేకూరనుంది. మొబైల్స్ బొనాంజా పేరుతో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే సేల్ ప్రారంభం కాగా ఈ నెల 10వ తేదీ వరకు సేల్ ఉంటుంది.
Also Read: ఐఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్..?
మొబైల్స్ బొనాంజా సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను ప్రకటించడంతో పాటు పలు ప్రముఖ బ్రాండ్ల కంపెనీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పలు స్మార్ట్ ఫోన్లపై నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకునే వారికి ప్రయోజనం చేకూరనుంది. ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించడం గమనార్హం.
Also Read: కస్టమర్లకు శుభవార్త.. జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్ విడుదల ఎప్పుడంటే..?
ఐఫోన్ ఎస్‌ఈ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 32,999 రూపాయలకే ఈ సేల్ లో కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 7 4జీబీ రామ్ 64 జీబీ మెమొరీ స్మార్ట్ ఫోన్ 1,500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం 9,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ ఎక్స్ ఆర్ 64జీబీ వేరియంట్ ధర రూ.40 వేలుగా ఉండగా ఐఫోన్ 11 ప్రొ పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 26,600 రూపాయల డిస్కౌంట్ ఇవ్వడం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
10,000 రూపాయల లోపు ఉన్న స్మార్ట్ ఫోన్లపై సైతం ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. రెడ్ మీ 9 ఐ, రియల్‌మి నర్జో 6 జీబీ, ఒప్పో ఎ31 64 జీబీ, మోటొరోలా మోటో జి9్ 4 జీబీ+64 జీబీ వేరియంట్, ఆసుస్ రోగ్ ఫోన్ 8 జీబీ+128 జీబీ ధరలు కూడా తగ్గడం గమనార్హం.