సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. ఎవరు చేశారు? ఎందుకు?

తెలంగాణలోనే అత్యంత శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మాత్రమే. అలాంటిది ఆయనకు దగ్గర బంధువులను కిడ్నాప్ చేస్తే ఏమైనా ఉంటుందా? కథ వేరేగుంటది. ఇప్పుడు అలానే అయ్యింది. Also Read: రాజగోపాల్‌ యూటర్న్‌..: ఎన్నికలకు ఆరు నెలల ముందే ఆలోచిస్తాడట సికింద్రాబాద్ లోని బోయినపల్లిలో మంగళవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువు, జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతడి ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనమైంది. ఈ […]

Written By: NARESH, Updated On : January 6, 2021 4:37 pm
Follow us on

తెలంగాణలోనే అత్యంత శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సీఎం కేసీఆర్ మాత్రమే. అలాంటిది ఆయనకు దగ్గర బంధువులను కిడ్నాప్ చేస్తే ఏమైనా ఉంటుందా? కథ వేరేగుంటది. ఇప్పుడు అలానే అయ్యింది.

Also Read: రాజగోపాల్‌ యూటర్న్‌..: ఎన్నికలకు ఆరు నెలల ముందే ఆలోచిస్తాడట

సికింద్రాబాద్ లోని బోయినపల్లిలో మంగళవారం రాత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువు, జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతడి ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనమైంది. ఈ క్రమంలోనే పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. మీడియాలోనూ ఈ వార్తలు సంచలనమయ్యాయి.

బోయినపల్లిలో నివాసం ఉంటున్న ప్రవీణ్ రావు, ఆయన సోదరులు సునీల్ రావు,నవీన్ రావును మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. ఈ క్రమంలోనే సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నార్త్ జోన్ పోలీసులు కిడ్నాపర్లను వెంబడించారు.

ఈ క్రమంలోనే రాంగోపాల్ పేటలో రెండు వాహనాలను పట్టుకొని ముగ్గురు నిందితులతోపాటు మరో 8మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక కిడ్నాప్ చేసే క్రమంలో దుండగులు కర్నూలుకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

Also Read: కాంగ్రెస్ లో సంచలనం: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి?

ఈ కిడ్నాప్ వెనుక హఫీజ్ పేటలోని రూ.100 కోట్ల విలువైన భూమియే కారణమని సమాచారం. ఈ భూమి కోసం కొంతకాలంగా కేసీఆర్ బంధువులతో ప్రత్యర్థులకు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ వ్యవహారం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వికారాబాద్ లో ప్రవీణ్ రావు ముగ్గురు సోదరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు రక్షించారు. తాము సురక్షితంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, మీడియాకు ప్రవీణ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్