https://oktelugu.com/

ఆ మంత్రులపై వేటుకే.. కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా?

తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నిక జరిగినా కూడా కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లేది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత సీన్ రివర్స్ అయినట్లు కన్పిస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ మరువక ముందే గ్రేటర్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. Also Read: చివరి అంకానికి చేరిన టీపీసీసీ ఎంపిక.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు? దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 10:28 AM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నిక జరిగినా కూడా కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లేది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత సీన్ రివర్స్ అయినట్లు కన్పిస్తోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ మరువక ముందే గ్రేటర్లోనూ అదే సీన్ రిపీట్ అయింది.

    Also Read: చివరి అంకానికి చేరిన టీపీసీసీ ఎంపిక.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు?

    దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అదే సమయంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుందనే టాక్ విన్పిస్తోంది. ఈక్రమంలోనే బీజేపీలోకి అధికార టీఆర్ఎస్.. కాంగ్రెస్ ల నుంచి పెద్దఎత్తున నాయకులు చేరుతుండటం కొద్దిరోజులుగా కన్పిస్తోంది.

    త్వరలోనే జరిగే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసిరేలా కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు బేజారు కావాల్సిందేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

    Also Read: మొత్తానికి మోడీషాలను కేసీఆర్ శరణు వేడాడా?

    తెలంగాణలో టీఆర్ఎస్ వరుస ఓటములు.. మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు. ఈమేరకు క్యాబినెట్లో మార్పులు చేర్పులకు సిద్ధంగా ఉన్నారనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లోని ఐదుగురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని వీరిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది.

    టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ చివరి నాటికి కొంతమంది మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఎవరికీ మంత్రి పదవులు ఊడుతాయి.. మరేవరినీ అదృష్టం వరించనుందనేది ఆసక్తిని రేపుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్