రైతులపై మా తండ్రి వ్యాఖ్యలకు బాధపడుతున్నా: యువరాజ్ సింగ్
వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దతు తెలిపారు. రైతులు, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను త్వరగా పరిష్కరించాలని కోరారు. రైతుల నిరసనలపై తన తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తాను బాధపడ్డానని తెలిపారు. అయితే కరోనా ఇంకా తొలిగిపోనందును రైతులు జాగ్రత్తలు తీసుకుంటూ నిరసన తెలపాలని కోరారు. రైతులు దేశానికి జీవనాడి అని రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రైతులు సైతం తమ ఉద్యమాన్ని […]
Written By:
, Updated On : December 12, 2020 / 10:27 AM IST

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దతు తెలిపారు. రైతులు, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను త్వరగా పరిష్కరించాలని కోరారు. రైతుల నిరసనలపై తన తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తాను బాధపడ్డానని తెలిపారు. అయితే కరోనా ఇంకా తొలిగిపోనందును రైతులు జాగ్రత్తలు తీసుకుంటూ నిరసన తెలపాలని కోరారు. రైతులు దేశానికి జీవనాడి అని రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. రైతులు సైతం తమ ఉద్యమాన్ని శాంతి యుతంగా నిర్వహించాలని ట్విట్టర్ లో తెలిపారు.