తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ప్రత్యేక రాయలసీమ కోసం అక్కడి నేతలు పట్టుబట్టారు. గ్రేటర్ రాయలసీమను ప్రకటించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఆ తర్వాత.. స్తబ్ధతత నెలకొంది. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో మళ్లీ రాయలసీమ డిమాండ్ తెరపైకి తెస్తున్నారు.
Also Read: చంద్రబాబు చేయని పని.. జగన్ కు పోల‘వర’మవుతుందా?
ఆరు జిల్లాలతో..
రాయలసీమ ఉద్యమాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. అయితే.. నాలుగు జిల్లాలతోనే గ్రేటర్ సీమ అంటే.. మరీ తక్కువగా ఉంటుందనే ఉద్దేశం తో మరో రెండు జిల్లాలను కలుపుకుంటున్నారు. సీమలోని నాలుగు జిల్లాలతో పాటు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా చేర్చుకుంటున్నారు. ఈ ఆరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ల కసరత్తు..
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని సీమ సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన “జై గ్రేటర్ రాయలసీమ” అనే పుస్తకం రాసి, ఆవిష్కరించారు కూడా. ఇంకా.. మైసూరారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, శివారెడ్డి కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.
Also Read: ఏపీ కేబినెట్లోకి ఈసారి వారికే ఛాన్స్..?
ప్రెస్ మీట్లకే పరిమితం..!
సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పటి నుంచి వీరంతా కలిసి.. పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖకు రాయలసీమకు సంబంధమే లేదని అంటున్న నేతలు.. తమకు హైకోర్టు వద్దు.. ప్రత్యేక రాష్ట్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకెళ్ళాలని పిలుపునిస్తున్నారు. అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. మీడియా మీట్లు పెడుతున్నారు. కానీ.. క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు మాత్రం లేవు. దీంతో.. ఇదంతా రాజకీయంగా ప్రాధాన్యత దక్కని నేతల చర్యగానే మిగిలిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ పెట్టి సీమలో తిరిగారు. కానీ ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి, వీరి పోరాటం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్