spot_img
Homeఅత్యంత ప్రజాదరణచంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?

చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?

గుజరాత్‌లో పుట్టి దేశ పాల ఉత్పత్తి రంగంలో అద్భుతాలు సృష్టించిన అమూల్‌ సంస్ధ ఏపీలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొలి దశలో మూడు జిల్లాల్లో అమూల్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. జిల్లాల్లోని ప్రభుత్వ డెయిరీలతో కలిసి పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌, ఇతర వ్యవహారాలను అమూల్‌ చేపట్టబోతోంది. రైతు భరోసా కేంద్రాల వేదికగా పాల సేకరణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టును సీఎం జగన్‌ గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. ఇది విజయవంతమైతే హెరిటేజ్‌తో పాటు ఇతర ప్రైవేటు డెయిరీలకు చుక్కలు కనిపించడం ఖాయమే.

Also Read: హైదరాబాద్.. భాగ్యనగరం.. ఇందులో ఏదీ అసలు పేరు..?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవిస్తుంటారు. ముఖ్యంగా కరవు ప్రభావిత ప్రాంతాల్లో పశువుల పోషణ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది.ప్రకాశం జిల్లా అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఆ జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో 2468 మంది జనాభా ఉన్నారు. అందులో 900 మంది రైతులుండగా 230 మంది పాల రైతులున్నారు.

వ్యవసాయానికి అనుగుణంగా భూములున్నప్పటికీ పూర్తిగా వర్షాధార ప్రాంతం కావడంతో అత్యధికులు పశువుల పోషణ ద్వారా జీవిస్తున్నారు. సగటున పూటకు 300 లీటర్ల పాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది. ప్రస్తుతం ఈ గ్రామంలో అమూల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పాలసేకరణ ప్రారంభించింది.

నవంబర్ 26న అమూల్ పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించాలని భావించినప్పటికీ అది వాయిదా పడింది. అయినాకానీ.. 20వ తేదీ నుంచే ఈ గ్రామంలో పాల సేకరణ ప్రారంభించారు.

అమూల్ సంస్థ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల్లో పాల సేకరణ ప్రారంభించగా ప్రస్తుతం 58 మంది రైతులు పాలు పోసేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 56 లీటర్ల పాలు ఈ కేంద్రంలో సేకరించినట్టు ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్నమహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం కార్యదర్శి బీబీసీకి తెలిపారు.

అమూల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భవనాల్లో సేకరణ ప్రారంభానికి ముందు తమ గ్రామంలో లీటర్ పాలు ఫ్యాట్ శాతం 10 ఉంటే రూ. 58కు లభించేవని, ప్రస్తుతం అది రూ.65కి పెరిగిందని గ్రామంలో పాల ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

Also Read: కేసీఆర్‌‌ నోట.. మళ్లీ ఢిల్లీ మాట

గ్రామంలో సగటున రోజుకి 600 లీటర్లు వస్తే దానికి సుమారుగా రూ.7 చొప్పున పెరిగిన ధర ప్రకారం మొత్తం రూ. 4,200 ఆ ఒక్క గ్రామంలోని రైతులకు లబ్ధి చేకూరుతున్నట్టు వారు చెబుతున్నారు. తద్వారా నెలకు కనీసంగా రూ. 1.25 లక్షల మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్టు కనిపిస్తోంది.

అమూల్ సంస్థతో పాటుగా హెరిటేజ్, ఒంగోలు మిల్క్ డెయిరీ సహా అందరూ పాల సేకరణ ధర పెంచడం మూలంగా ఈ ప్రయోజనం చేకూరుతున్నట్టు చెబుతున్నారు.

ప్రభుత్వమే అమూల్ ద్వారా పాలసేకరణ చేపట్టడం మూలంగా పాల వ్యాపారంలో పలు మార్పులు జరగబోతున్నాయనడానికి కలికివాయి గ్రామ అనుభవం చెబుతుంది.

ప్రస్తుతం తొలి దశలో మూడు జిల్లాల్లోని 250 గ్రామాల్లో ఈ పాలసేకరణ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి, మార్కెట్ రంగంలో జరుగుతున్న మార్పులపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది.

గుజరాత్‌లోని ఆనంద్ సమీపంలో అమూల్ సంస్థను సహకార పద్ధతిలో స్వతంత్ర్యానికి పూర్వం ప్రారంభించారు. 1946 లో ఏర్పడిన ఈ సహకార సంస్థ, గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జిసిఎంఎంఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహణ సాగుతోంది. 36 లక్షల మంది గుజరాతీ పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో ఇది నడుస్తోంది.

Also Read: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై పది రోజులు..?

తొలుత కైరా డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ లిమిటెడ్‌తో ప్రారంభించారు. అనంతరం అముల్‌గా పేరు మార్చారు. 1949లో డాక్టర్ వర్గీస్ కురియన్‌ అమూల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ విశేషంగా విస్తరించింది. కురియన్‌ ”మిల్క్ మేన్ ఆఫ్ ఇండియా”గా పేరు గడించారు. విదేశాలకు కూడా ఈ సంస్థ విస్తరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,899 పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు దశల్లో వాటిని పూర్తి చేస్తారు. తొలుత చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించబోతున్నారు. మరో 7,125 పాల సేకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

నిర్మాణాల నిమిత్తం రూ. 1,231 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. మౌలిక వసతుల కోసం మొత్తం రూ. 1,362 కోట్లు వెచ్చిస్తుండగా అందులో 20 శాతం ప్రభుత్వమే కంట్రిబ్యూషన్ గా చెల్లించేందుకు సిద్ధమయ్యింది. మిగిలిన మొత్తం జాతీయ సహకార సంస్థ నుంచి 10 ఏళ్లలో తిరిగి చెల్లించే ఒప్పందం మేరకు రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో సహకార డెయిరీలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. హెరిటేజ్ కి ధారాదత్తం చేస్తున్నారు. అందుకే మేము అధికారంలోకి వస్తే రైతులకు లీటర్ కి రూ. నాలుగు అదనంగా ఇచ్చి, పాల సేకరణ చేసి, ప్రభుత్వ డెయిరీలను నిలబెడతాం” అంటూ జగన్ ఎన్నికల ప్రచార హామీ గుర్తుండే ఉంటుంది కదా..!! ఆ హామీ నెరవేర్చే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వ డెయిరీలను అమూల్ కి అప్పగింత జరుగుతుంది. అంటే పాల వ్యాపారంలో కార్పొరేట్ దిగ్గజంగా ఉన్న అమూల్ ని రంగంలోకి దించి.., ఏపీలో కార్పొరేట్ కంపెనీగా ఉన్న హెరిటేజ్ పాల మూలాలను దెబ్బకొడితే… తన హామీ నెరవేరినట్టు.., బాబు వ్యాపారం బెడిసికొట్టినట్టు. రెండు కార్యాలు జరిగిపోతాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES
spot_img

Most Popular