నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులకు జగన్ అందలం

ఏపీ పంచాయితీ ఫైట్ లో సీఎం జగన్ కు అండగా నిలిచిన ఇద్దరు పంచాయితీరాజ్ అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ బదిలీ చేసి వారిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డకు సహకరించలేదని వారిపై ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో నిమ్మగడ్డ చెప్పినట్టు వారిని బదిలీ చేసిన జగన్ సర్కార్ తాజాగా కొత్త పోస్టింగులు ఇచ్చింది. కీలక మైన స్థానాల్లో వారిని నియమించడం విశేషం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఇక […]

Written By: NARESH, Updated On : January 28, 2021 8:36 am
Follow us on

ఏపీ పంచాయితీ ఫైట్ లో సీఎం జగన్ కు అండగా నిలిచిన ఇద్దరు పంచాయితీరాజ్ అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ బదిలీ చేసి వారిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డకు సహకరించలేదని వారిపై ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో నిమ్మగడ్డ చెప్పినట్టు వారిని బదిలీ చేసిన జగన్ సర్కార్ తాజాగా కొత్త పోస్టింగులు ఇచ్చింది. కీలక మైన స్థానాల్లో వారిని నియమించడం విశేషం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

ఇక వీరితోపాటు నిమ్మగడ్డ బదిలీ చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డికి సైతం కీలక పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొత్తంగా ముగ్గురు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను నిమ్మగడ్డ కాదన్నా కూడా ప్రభుత్వం నెత్తిన పెట్టుకోవడానికి రెడీ అయ్యింది.

వీరిద్దరితోపాటు కీలక బదిలీలను ఏపీ ప్రభుత్వం చేసింది. నిమ్మగడ్డ బదిలీ చేసిన నారాయణ్ భరత్ గుప్తాను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీగా నియమించింది. గ్రామ/వార్డు సచివాలయ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఈ స్థానంలో ఉన్న నవీన్ కుమార్ ను గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ గా నియమించింది.

ఇక నిమ్మగడ్డ బదిలీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ను రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలను శామ్యూల్ కు అప్పగించింది.

నిమ్మగడ్డ బదిలీ చేసిన గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ను అదే పంచాయితీ శాఖ రాజ్ శాఖలోనే కీలక బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుందిన ఎస్పీ రమేశ్ రెడ్డికి కీలక పోస్టింగ్ కోసం కసరత్తు చేస్తున్నారు.