https://oktelugu.com/

‘వర్క్ ఫ్రం హోం’పై జాన్వి ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం అంటూ కరోనా లాక్ డౌన్ తర్వాత అందరినీ ఇంటి నుంచే పనిచేయించడంపై ఆమె స్పందించారు. ఇంటి నుండి పని చేయాలనే భావనను ఎక్కువగా ఇష్టపడటం లేదామే.. సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ల్యాప్‌టాప్ ముందు కూర్చుని, ఆసక్తి లేకుండా చూస్తున్నట్లు జాన్వి ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జాన్వి స్వెట్టర్ జాకెట్ వేసుకుని, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2021 / 09:52 PM IST
    Follow us on

    బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం అంటూ కరోనా లాక్ డౌన్ తర్వాత అందరినీ ఇంటి నుంచే పనిచేయించడంపై ఆమె స్పందించారు. ఇంటి నుండి పని చేయాలనే భావనను ఎక్కువగా ఇష్టపడటం లేదామే.. సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

    ల్యాప్‌టాప్ ముందు కూర్చుని, ఆసక్తి లేకుండా చూస్తున్నట్లు జాన్వి ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జాన్వి స్వెట్టర్ జాకెట్ వేసుకుని, ఓ డ్రింక్ ను సిప్ చేస్తోంది. “వారు చెప్పిన ఇంటి నుండి పని చేయండి, వారు చెప్పినట్లు సరదాగా ఉంటుంది” అని ఆమె పోస్టులో రాసుకొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ చేయడం అంత ఈజీకాదని.. ఔట్ డోర్ లో చేసి ఇన డోర్ లో చేయడం కష్టమని తెలిపారు.

    జాన్వి ఇటీవలే ఓటీటీలో విడుదలైన “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్” చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం పంజాబ్లో షూటింగ్ ప్రారంభించిన “గుడ్ లక్ జెర్రీ” లో నటించనుంది. సిద్దార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పంకజ్ మట్టా రచించిన ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కూడా నటించారు. ఆమె ఇతర చిత్రాలు “రూహి అఫ్జానా” మరియు “దోస్తానా 2” కూడా లైన్లో ఉన్నాయి.