https://oktelugu.com/

క్రిస్మస్ స్టార్ ప్రత్యేకత ఏంటీ..?

ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభాలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొన్ని దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియారిటీ ఉంది. వీరికి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సే. ప్రతీయేటా డిసెంబర్ 25న క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాశ్చత్య దేశాల్లో డిసెంబర్ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఈ పండుగ కోసం క్రిస్టియంతా ఏడాదంతా ఎదరుచూస్తుంటారు. ప్రపంచ దేశాలతోపాటు ఇండియాలోనూ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2020 / 10:22 PM IST
    Follow us on

    ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభాలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొన్ని దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియారిటీ ఉంది. వీరికి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సే.

    ప్రతీయేటా డిసెంబర్ 25న క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాశ్చత్య దేశాల్లో డిసెంబర్ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతూ ఉంటాయి.

    ఈ పండుగ కోసం క్రిస్టియంతా ఏడాదంతా ఎదరుచూస్తుంటారు. ప్రపంచ దేశాలతోపాటు ఇండియాలోనూ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

    క్రిస్మస్ పండుగ దగ్గర పడుతుండటంతో క్రిస్టియన్లంతా వేడుకలకు సిద్ధమవుతున్నారు.క్రిస్మస్ వేడుకల్లో ప్రార్థనలు.. కేక్ కటింగ్స్.. శాంటా క్లాజ్.. బహుమతులు ఇవ్వడం.. క్రిస్మస్ ట్రీ లాంటివి ప్రత్యేక ఆకర్షణగా కన్పిస్తూ ఉంటాయి.

    వీటితోపాటు క్రిస్మస్ స్టార్ ను క్రిస్టియన్లు తమ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. దీనిని ఒక కొత్త శకానికి నాంది పలికిన ఏసుక్రీస్తు జన్మించడనే గుర్తుగా ప్రతీ ఇంటా క్రిస్టియన్లు క్రిస్మస్ స్టార్ ను వాడుతుంటారు.

    క్రీస్తు పుట్టిన సమయంలో ఆనాడు ఆకాశంలోని ఓ నక్షత్రం ఒకటి కాంతిని విరాజిమ్మింది. ఈ సంకేతాన్ని జ్ఞానులు ఏసు ప్రభువు జనన సంకేతంగా పేర్కొనడం జరిగింది.

    ఆ వెలుగు పంచిన నక్షత్రానికి గుర్తుగా.. ఏసు క్రీస్తు తమ ఇంట జన్మించాడనే పవిత్ర భావనతో క్రిస్టియన్లు తమ ఇండ్లపైన క్రిస్మస్‌ స్టార్లు వేలాడదీయడం ఆనవాయితీగా వస్తోంది.