బిగ్ బాస్ విజేత అభిజిత్.. సగం ఓట్లు అతడికే!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్ బాస్ విజేత ఎవరనేది తేలిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ గేమ్ లో గేమ్ సరిగా ఆడకున్నా మైండ్ గేమ్ తో ఎవ్వరిని ఏమో నొప్పింపక తానొవ్వక సైలెంట్ గా మెదిలిన అభిజిత్ ప్రేక్షకులను మెప్పించి చివరకు విజేతగా నిలిచాడు. హౌస్ లోనే యాక్టివ్ గా అన్ని గేమ్స్ ఆడి అమ్మాయిలతో సరసాలు చేసిన అఖిల్ కు నిరాశ ఎదురైంది. అతడు రన్నరప్ గా నిలిచాడు. ఇక […]

Written By: NARESH, Updated On : December 21, 2020 7:28 am
Follow us on

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్ బాస్ విజేత ఎవరనేది తేలిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ గేమ్ లో గేమ్ సరిగా ఆడకున్నా మైండ్ గేమ్ తో ఎవ్వరిని ఏమో నొప్పింపక తానొవ్వక సైలెంట్ గా మెదిలిన అభిజిత్ ప్రేక్షకులను మెప్పించి చివరకు విజేతగా నిలిచాడు. హౌస్ లోనే యాక్టివ్ గా అన్ని గేమ్స్ ఆడి అమ్మాయిలతో సరసాలు చేసిన అఖిల్ కు నిరాశ ఎదురైంది. అతడు రన్నరప్ గా నిలిచాడు. ఇక సోహైల్ లక్కీ చాన్స్ తీసుకొని రూ.25 లక్షలు తీసుకోవడం విశేషం.

మూడు నాలుగు వారాలుగా సోషల్ మీడియాలో అభిజీత్ పేరు మారుమోగుతోంది. అతడే విజేత అని.. సగం ఓట్లు అతడికే వచ్చాయని హోరెత్తింది. అభిమానులు ఆశించినట్టే బిగ్ బాస్ విజేతగా అభిజిత్ నిలిచాడు.

ఇక బిగ్ బాస్ లో టాప్ 5లో ఉన్న హారిక ముందు ఎలిమినేట్ కాగా.. టాప్ 4గా అరియానా ఎలిమినేట్ అయ్యింది. ఇక టాప్ 3గా నిలిచిన అభిజిత్, అఖిల్, సోహైల్ లకు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రూ. 25 లక్షలు తీసుకొని ఒకరు వైదొలగవచ్చని సూచించాడు. దీన్ని క్యాష్ చేసుకొని సోహైల్ బయటకు వచ్చాడు. ఇది బిగ్ బాస్ లోనే ట్విస్ట్ అని చెప్పవచ్చు.

అభిజిత్ గెలుపు కోసం టాలీవుడ్ సినీ ప్రముఖులు క్యాంపెయిన్ చేశారు. ఫ్యాన్స్ హోరెత్తించారు. ఆయన ప్రమోషన్ కూడా బాగా జరిగింది.అందువల్ల నాలుగైదు వారాల ముందుగానే ఈ ఫలితం స్పష్టంగా అర్థమైంది. విజేతగా అన్నట్టే అభిజిత్ నిలిచాడు.

బిగ్ బాస్ ఫైనల్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఫైనల్ విజేతను ప్రకటించాడు. అంతకుముందు బిగ్ బాస్ దర్శకుడు అనిల్ రావిపూడి, మెహరీన్, రాయ్ లక్ష్మీ, ప్రణీత లాంటి వారంతా బిగ్ బాస్ ఫినాలెలో అలరించారు.