
నేడు సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, అభిమానులు పెద్దఎత్తున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు చలన చిత్రసీమపై చెరగని ముద్రవేశారు. తెలుగు చిత్రసీమను సాంకేతికంగా కొత్తపుంతలు తొక్కించారు. ప్రస్తుతం ట్వీటర్లో ‘హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు’ అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణకు మెగాస్టార్ చిరంజీవి తన ట్వీటర్ ద్వారా స్పెషల్ విషెస్ తెలియజేశారు.
‘కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14చిత్రాలు.. నిర్మాతగా తెలుగుతోపాటు భారతీయ భాషల్లో 50చిత్రాలు.. మొదటి సినిమాస్కోప్ చిత్రం ఆయనదే.. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సాహసానికి మారు పేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణగారితో దిగిన ఫొటోన ట్వీటర్లో షేర్ చేశారు.
కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ track record. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,Superstar Krishna గారికి జన్మదినశుభాకాంక్షలు.💐 pic.twitter.com/6oa9wFg0Nn
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2020
అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన కొత్త సినిమా మూవీ అప్డేట్ రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఫస్టు లుక్ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన ట్వీటర్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘నా ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్. హ్యపీ బర్త్ డే నాన్న.. మీకెప్పటికీ రుణపడి ఉన్నాను.. మీ రుణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను’ అంటూ మహేశ్ ట్విట్టర్లో కృష్ణగారికి విషెస్ చెప్పారు. అలాగే మహేష్ సతీమణి నమత్రా శిరోద్కర్, మనవడు గౌతమ్, మనవరాలు సితార తదితరులు కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు సూపర్ స్టార్ నటించిన 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’లోని క్లైమాక్స్ డైలాగ్‌ను డబ్ స్మాష్ చేసి డిఫరెంట్ గా జన్మదిన విషెస్ చెప్పారు.ఈ వీడియోను తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. వీరితోపాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, నటీనటులు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.