చెన్నై మెట్రోను ఫాలో అవుతున్న హైదరాబాద్ మెట్రో..!

చైనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. రేపటి నుంచి లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా మెట్రో ట్రైన్ సర్వీసులు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్డౌన్ 5.0లో వీటికి అనుమతి లభిస్తుందని భావించినప్పటికీ కేంద్రం ఈ రంగాలకు సడలింపులు ఇవ్వలేదు. జూన్ నెల ఫేజ్-3లో పరిస్థితిని బట్టి కేంద్రం మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మెట్రో ట్రైన్ […]

Written By: Neelambaram, Updated On : May 31, 2020 2:53 pm
Follow us on


చైనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. రేపటి నుంచి లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా మెట్రో ట్రైన్ సర్వీసులు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్డౌన్ 5.0లో వీటికి అనుమతి లభిస్తుందని భావించినప్పటికీ కేంద్రం ఈ రంగాలకు సడలింపులు ఇవ్వలేదు. జూన్ నెల ఫేజ్-3లో పరిస్థితిని బట్టి కేంద్రం మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మెట్రో ట్రైన్ సర్వీసులు ప్రారంభమైతే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వాహకులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చెన్నై మెట్రో ఓ కొత్త విధానానికి నాంది పలికింది. మెట్రో స్టేషన్లలో ప్రతీఒక్కరు ఉపయోగించేది లిఫ్టు బటన్లపై దృష్టిసారించింది. వీటిని చేతులతో కాకుండా కాళ్లతో లిప్టు బటన్ నొక్కితే పనిచేసేలా రూపొందించారు. దీని ద్వారా వైరస్ నియంత్రించే అవకాశం ఉండటంతో ఈ ఐడియాకు ప్రయాణీకులు ఫిదా అవుతున్నారు.

లాక్డౌన్ అనంతరం మెట్రో స్టేషన్లో ట్రైన్లు పరిగులు తీయడం ఖాయం. ఇప్పటికే ప్రజలకు వైరస్ పై అవగాహన రావడంతో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటివి చేస్తున్నారు. సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు ప్రతీఒక్కరు కొన్ని ప్రదేశాలను తాకాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు మెట్ల పక్కన ఉండే గ్రిల్స్, లిఫ్టు బటన్లు, డోర్ హ్యాండిళ్లు వంటివి. మెట్రో ట్రైన్లలో లిఫ్టు బటన్లు ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉండటాన్ని గుర్తించిన చెన్నై మెట్రో దీనికి సరికొత్త పరిష్కారాన్ని కనుక్కొంది. లిఫ్టు బటన్లు చేతితో కాకుండా కాళ్లతో నొక్కితే పనిచేసేలా మీటలను అమర్చారు.

కోయంబేడులోని చెన్నై మెట్రో ప్రధాన కార్యాలయంలో ఈ సదుపాయాన్ని ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. ఇలా చేయడం వైరస్ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశం ఉండటంతో అన్ని మెట్రో స్టేషన్లోలో ఈ తరహా ప్రయోగం చేయనున్నారు. ఇదే కోవలో హైదరాబాద్ మెట్రో సర్వీసులు ప్రారంభించే నాటికి మన దగ్గర కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరబాద్ మెట్రోలోనూ ఈ తరహా లిప్టులు కన్పించే అవకాశం లేకపోలేదు. ప్రయాణీకుల సౌకర్యార్థం వినూత్న ఆలోచన చేసిన చైన్నె మెట్రోను ప్రతీఒక్కరు ప్రశంసిస్తున్నారు.