Homeఅత్యంత ప్రజాదరణమళ్ళీ మేకప్ వేసుకున్న చిరంజీవి సతీమణి !

మళ్ళీ మేకప్ వేసుకున్న చిరంజీవి సతీమణి !

కన్నడ స్టార్‌ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో హీరో చిరంజీవి సర్జా సడెన్ గా మృతి చెంది, ఆయన భార్య, నటి మెఘనా రాజ్‌ ను ఒంటరిని చేశారు. అయితే, చిరంజీవి సర్జా చనిపోయిన దగ్గర నుండి ఆయన జ్ఞాపకాలతోనే కాలం గడిపేసిన మెఘనా రాజ్‌ మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అయింది. చిరంజీవి సర్జా చనిపోయే నాటికీ ఆమె గర్భవతి. మెఘనా రాజ్‌ ఒక బాబుకి జన్మినిచ్చింది. ఆమె తన కొడుకుకి జూనియర్ […]

Meghana Rajకన్నడ స్టార్‌ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో హీరో చిరంజీవి సర్జా సడెన్ గా మృతి చెంది, ఆయన భార్య, నటి మెఘనా రాజ్‌ ను ఒంటరిని చేశారు. అయితే, చిరంజీవి సర్జా చనిపోయిన దగ్గర నుండి ఆయన జ్ఞాపకాలతోనే కాలం గడిపేసిన మెఘనా రాజ్‌ మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అయింది. చిరంజీవి సర్జా చనిపోయే నాటికీ ఆమె గర్భవతి.

మెఘనా రాజ్‌ ఒక బాబుకి జన్మినిచ్చింది. ఆమె తన కొడుకుకి జూనియర్ చిరంజీవి అని భర్త పేరే పెట్టుకుంది. అయితే, జూనియర్ చిరంజీవికి ఇప్పుడు 9 నెలలు కాబట్టి, మళ్ళీ నటించాలని నిర్ణయించుకుంది. తన బాధని దిగమింగుకొని మళ్ళీ కెమెరా ముందుకొస్తేనే.. తాను మళ్ళీ మామూలు మనిషి అవుతాను అని ఆమె నిర్ణయించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Meghana Raj Sarja (@megsraj)


కాగా మేఘన తన రీఎంట్రీ పై వివరణఇస్తూ.. ‘ఈ రోజు నా కుమారుడికి 9 నెలలు. ఇక ఏడాది తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకొచ్చాను’ అంటూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. మెఘనా రాజ్‌ గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె చాలా చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. అందులో భాగంగానే అల్లరి నరేష్ సరసన ‘బెండు అప్పారావు’ సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్ చేసింది.

అయితే ఆ తర్వాత కన్నడ చిత్రసీమలోకి అడుగు పెట్టి, అక్కడ హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలో కన్నడ హీరో చిరంజీవి సర్జాతో ప్రేమలో పడి, అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, చిరంజీవి సడెన్ గా చనిపోవడంతో మళ్లీ సినిమాలు చేయాలని ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Meghana Raj Sarja (@megsraj)

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper