ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇంతగా ఊగిపోవడం వెనుక ఎవరున్నారని అక్కడ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు నామినేట్ చేసిన నిమ్మగడ్డ వైసీపీ ప్రభుత్వాన్ని ఆగమాగం చేసేస్తున్నాడు.
అయితే నిమ్మగడ్డ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ జగన్ కూడా అంతే ధీటుగా నిలబడుతున్నారు. ఇటీవలే ‘పంచాయితీ’లొల్లి కొలిక్కి వచ్చి ఏపీలో ఎన్నికలు సాగుతుండగా జగన్ కీలక వ్యూహం పన్నారు. అసలు ఎన్నికలే జరగకుండా భారీగా ఏకగ్రీవాలకు నజరానాలు ప్రకటించారు. దీంతో పంచాయితీలన్నీ ఎన్నికలను మరిచి ఏకగ్రీవం కోసం ట్రై చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పట్టుబట్టి మరీ ఏకగ్రీవాలు చేయిస్తూ నిమ్మగడ్డ, టీడీపీకి షాకిస్తున్నారట..
నిమ్మగడ్డతో వేసిన ప్లాన్ ను సీఎం జగన్ ప్లాప్ చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు బయటకొచ్చాడు. వైసీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కావని చంద్రబాబు ధ్వజమెత్తారు. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలన్నారు.
టీడీపీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు అమరావతిలోని కేంద్రకార్యాలయంలో మాట్లాడారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వైసీపీ దౌర్జన్యాలతో ఏకంగా ఏపీలో 2274 ఏకగ్రీవాలు చేశారని.. విధ్వంసాలకు సంబంధించిన వీడియోలు చూడాలని చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారని ప్రశ్నించారు. ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు.
ఇలా జగన్ వేసిన ప్లాన్ కు షేక్ అవుతున్న చంద్రబాబు ఎట్టకేలకు బయటకొచ్చి బయటపడ్డాడు. నిమ్మగడ్డ ద్వారా ఎన్నికలను జరిపించి లబ్ధి పొందాలను బాబు ప్లాన్ చేస్తే ఏకగ్రీవాలతో వైసీపీ సర్కార్ అసలుకే ఎసరు పెడుతున్న చందంగా మారింది.