https://oktelugu.com/

అజ్ఞాతవాసి.. మన చంద్రబాబు!

గత ఆరేడు నెలలుగా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎందుకు పెద్దగా తెరమీదకు రావడం లేదు..? కరోనా టైంలోనూ ఎందుకు లేఖలతోనే సరిపెట్టారు..? ఇంత పెద్ద ఫ్లడ్స్‌ వచ్చినా ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు..? ఏజ్‌ ప్రాబ్లమా..? కరోనా భయమా..? వీటన్నింటి వెనకాల ఇంకా ఏదైనా రాజకీయం దాగి ఉందా..? కొడుకు లోకేష్‌ని జనంపై రుద్దేందుకు ఏమైనా స్కెచ్‌ వేశారా..? Also Read: వచ్చే నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు చంద్రబాబు.. దశాబ్దాల చరిత్ర ఉన్న లీడర్‌‌. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 01:02 PM IST
    Follow us on

    గత ఆరేడు నెలలుగా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎందుకు పెద్దగా తెరమీదకు రావడం లేదు..? కరోనా టైంలోనూ ఎందుకు లేఖలతోనే సరిపెట్టారు..? ఇంత పెద్ద ఫ్లడ్స్‌ వచ్చినా ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు..? ఏజ్‌ ప్రాబ్లమా..? కరోనా భయమా..? వీటన్నింటి వెనకాల ఇంకా ఏదైనా రాజకీయం దాగి ఉందా..? కొడుకు లోకేష్‌ని జనంపై రుద్దేందుకు ఏమైనా స్కెచ్‌ వేశారా..?

    Also Read: వచ్చే నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

    చంద్రబాబు.. దశాబ్దాల చరిత్ర ఉన్న లీడర్‌‌. దేశ రాజకీయాల్లోనూ తనకంటూ సీనియర్‌‌ మోస్ట్‌ లీడర్‌‌ లేడని చెప్పుకుంటుంటారు. ఉమ్మడి ఏపీని, విభజిత ఏపీకి సీఎంగా చేసిన ఘనుడు. మరి అలాంటి నేత ఇప్పుడు ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారో తెలియడం లేదు. కేవలం ఎల్లో మీడియాలో తప్ప ఎక్కడా బయట ప్రజల్లో కనిపించడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట కేవలం టీడీపీ బ్యాచ్‌కే కనిపిస్తున్నారు. ఆయన మాటలు కూడా వారికే వినిపిస్తున్నాయి.

    ఈ వీడియో కాన్ఫరెన్స్‌ల పైనో.. లేదా ప్రభుత్వానికి రాస్తున్న లేఖల సారాంశం పేపర్లలో ఎక్కిస్తున్న సందర్భాల్లో మాత్రమే చంద్రబాబు ఫొటోలు కనిపిస్తున్నాయి. అవి కూడా ఓల్డ్‌ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పుట్టిన రోజులు కానీ.. జయంతులు కానీ ట్విట్టర్లలోనే హడావుడి చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బాబు.. నిత్యం ప్రజల్లో ఉండి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న కరోనా తగ్గుముఖం పట్టాక దాదాపు ఆరు నెలల తర్వాత అమరావతికి చేరుకున్నారు బాబు. మళ్లీ ఏమైందో ఏమో మటుమాయం అయిపోయారు.

    బాబు ఆంతర్యం వెనుక వైసీపీ నేతలు కొత్త భాష్యం చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన రోజు నుంచి చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. సరిగ్గా జగన్ లేఖ రాసిన రోజు నుంచి బాబు కనిపించడం లేదని.. ఇంతకీ చంద్రబాబు ఎక్కడున్నారు, ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలు ఏ ఉద్దేశంతో ఇలాంటి సెటైర్లు వేస్తున్నా.. అందులో నిజం కూడా లేకపోలేదు. వాస్తవానికి జగన్ రాసిన లేఖపై బాబు కాస్త తీవ్రంగానే ఆలోచిస్తున్నారట. ఇన్నాళ్లూ ఎన్నో వ్యవస్థల్ని మేనేజ్ చేసి, వైసీపీ సర్కార్‌‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న బాబు.. ఇప్పుడా వ్యవస్థల్లోని తన వ్యక్తుల్ని కాపాడుకునే పనిలో పడ్డారని సమాచారం.

    Also Read: వరద సాయంలో ఏపీ, తెలంగాణ.. ఏది బెటర్?

    ఎన్నికల కమిషనర్ విషయంలో ఇబ్బందులు సృష్టించి.. కోర్టుల ద్వారా చక్కదిద్దారన్న గుసగుసలు ఏపీ రాజకీయాల్లో ఉన్నాయి. . కోర్టు ఆదేశాలతో తిరిగి తన మనిషినే ఏపీ ఎన్నికల కమిషనర్‌‌గా తెచ్చుకున్నారన్న టాక్ ఉంది. కోర్టుల ద్వారా డాక్టర్లను కాపాడుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌నూ కాపాడే ప్రయత్నం చేశారంటున్నారు. ఇలా రకరకాల మార్గాల్లో తన పనులు చేయించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తిపైనే ఆరోపణలొచ్చాయి. దీంతో బాబు మరోసారి రంగంలోగి దిగారన్నది వైసీపీ బ్యాచ్ వాదన… తాజాగా సుప్రీం కోర్టులో వరుసగా పీటీషన్లు వేయడం.. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిస్తూ.. తన అనుకూల మీడియాలో దాన్ని హైలెట్ చేయిస్తూ.. రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అందుకే.. చంద్రబాబు అజ్ఞాతవాసిలా మారిపోయారని.. మరికొంత మందిని మేనేజ్‌ చేయడంలోనే బిజీ అయిపోయారని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూనే ఉన్నాయన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో సాగుతోంది.