మహేంద్రసింగ్ ధోనీ ఎందుకిలా చేస్తున్నాడు..?

ఒకప్పుడు కెప్టెన్‌ కూల్‌ అయిన మహేంద్రసింగ్‌ ధోనీ.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌ అవుతున్నాడు. స్టేడియంలో అతని వైఖరితో ఏదో ఒక వార్తలు నిలుస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో హూందాగా కనిపించే ధోనీ.. ఇటీవల ఓ మ్యాచ్ ముగుస్తున్న ద‌శ‌లో అంపైర్‌‌ను ఆల్మోస్ట్ బెదిరించినంత ప‌నిచేశాడు. త‌న బౌల‌ర్ వేసిన వైడ్ బాల్‌ను వైడ్‌గా ప్రక‌టించోయిన అంపైర్‌‌పై ధోనీ అస‌హ‌నం వ్యక్తం చేశాడు. వైడ్ ఇవ్వబోతున్న ఎంపైర్‌‌ కూడా ధోనీ తీరు చూసి వెన‌క్కి త‌గ్గాడంటే ఆ బెదిరింపు ఏ […]

Written By: NARESH, Updated On : October 18, 2020 2:12 pm
Follow us on

ఒకప్పుడు కెప్టెన్‌ కూల్‌ అయిన మహేంద్రసింగ్‌ ధోనీ.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌ అవుతున్నాడు. స్టేడియంలో అతని వైఖరితో ఏదో ఒక వార్తలు నిలుస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో హూందాగా కనిపించే ధోనీ.. ఇటీవల ఓ మ్యాచ్ ముగుస్తున్న ద‌శ‌లో అంపైర్‌‌ను ఆల్మోస్ట్ బెదిరించినంత ప‌నిచేశాడు. త‌న బౌల‌ర్ వేసిన వైడ్ బాల్‌ను వైడ్‌గా ప్రక‌టించోయిన అంపైర్‌‌పై ధోనీ అస‌హ‌నం వ్యక్తం చేశాడు. వైడ్ ఇవ్వబోతున్న ఎంపైర్‌‌ కూడా ధోనీ తీరు చూసి వెన‌క్కి త‌గ్గాడంటే ఆ బెదిరింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కు డూ ఆర్‌‌ డై మ్యాచ్‌

ఐపీఎల్‌ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. నిన్నటి మ్యాచ్‌లో మరో దారుణ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ప్లేఆఫ్ అవకాశాలనూ పోగొట్టుకుంటోంది. లీగ్‌ దశలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లేఆఫ్ చేరాలంటే.. ఆడబోయే ప్రతీ మ్యాచ్‌నూ గెలిచి తీరాల్సి ఉంటుంది. అదీ భారీ తేడాతో. అప్పుడే నెట్ రన్‌రేట్ మెరుగుపడి ప్లేఆఫ్‌ ఆశలు సజీవం అవుతాయి.

షార్జా వేదికగా.. చెన్నైసూపర్‌‌ కింగ్స్‌ జట్టు ఆదివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ కేపిటల్స్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ వీర విజృంభణ.. చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్ పించ్ హిట్టింగ్ ముందు నిలవలేకపోయింది. అయిదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ లక్ష్యాన్ని పూర్తి చేసింది. 19.5 ఓవర్లలో 185 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో 17 పరుగులను చేయాల్సి ఉన్న దశలో ఢిల్లీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రెచ్చిపోయి ఆడాడు. మూడు సిక్సర్లు బాదాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయం తర్వాత తమ నోటికి పని చెప్పారు. క్రిటిక్స్ టార్గెట్.. చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. వారిద్దరినీ టార్గెట్‌గా చేశారు. చివరి ఓవర్‌ను రవీంద్ర జడేజా చేతికి అప్పగించడం పట్ల ఘాటు విమర్శలు ఎదురవుతున్నాయి. ధోనీ వంటి కెప్టెన్ నుంచి అలాంటి నిర్ణయం వెలువడుతుందని తాము ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు. కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం మరొకటి ఉండబోదని, అపజయానికి అదే కారణమనీ మండిపడుతున్నారు.

Also Read: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ ఏమన్నాడంటే?

జమైకన్ స్ప్రింటర్ యోహాన్ బ్లేక్ సైతం ధోనీ నిర్ణయాన్ని తప్పు పట్టాడు. ధోనీ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం వల్లే ఆ జట్టు ఓడిపోయిందని అంటున్నాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను చేతులారా పోగొట్టుకున్నారని తేల్చేశాడు. ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో ఏమయ్యాడని ప్రశ్నించాడు. బ్రావో చేతికి చివరి ఓవర్‌ను అప్పగించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనీ అభిప్రాయపడ్డాడు. ఓ సెల్ఫీ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.