https://oktelugu.com/

ప్రజల్లోకి ట్రంప్‌.. గెలుపుపై హాట్ కామెంట్స్

మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డిబెట్లలోనూ పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోమారు అధ్యక్ష సీటును కైవసం చేసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ పాకులాడుతుండగా.. తొలి సారి అధ్యక్ష పీఠం ఎక్కాలని బైడెన్‌ ఉవ్విల్లూరుతున్నారు. Also Read: జగన్‌ లేఖలు అమిత్‌ షాకే ఎందుకు..? ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 2:00 pm
    Follow us on

    మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డిబెట్లలోనూ పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోమారు అధ్యక్ష సీటును కైవసం చేసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ పాకులాడుతుండగా.. తొలి సారి అధ్యక్ష పీఠం ఎక్కాలని బైడెన్‌ ఉవ్విల్లూరుతున్నారు.

    Also Read: జగన్‌ లేఖలు అమిత్‌ షాకే ఎందుకు..?

    ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి ఈ మధ్యే కోలుకున్నారు కూడా. కోలుకున్న తర్వాత తన ప్రచారం కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచారు. శనివారం మిచిగాన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లోనూ రిపబ్లికన్‌ పార్టీనే విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగానే ప్రజలు ఎల్లప్పుడూ రిపబ్లికన్‌ పార్టీనే ఆదరించాలని కోరారు.

    ‘తాజా ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఎన్నికల్లో విజయం మనదే. మరో నాలుగేళ్లు రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉండడం ఖాయం. భవిష్యత్‌లోనూ ప్రజలు ఇదే పంథాను కొనసాగించాలి. రిపబ్లికన్‌ పార్టీకి విజయం అందించాలి’ అని ట్రంప్‌ కోరారు. దీంతో అక్కడి వారంతా ‘మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు’ అంటూ నినాదాలు చేశారు.

    తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా తాము పనిచేస్తున్నామన్నారు. అమెరికా ప్రజల అండదండలతో ఇప్పటివరకు పాలన సక్రమంగా సాగిందని, రిపబ్లికన్‌ పార్టీకి మరోసారి అధికారమివ్వాలని అభ్యర్థించారు.

    Also Read: వచ్చే నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

    మరోవైపు అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బైడెన్‌ మధ్య అక్టోబర్‌‌ 15న జరగాల్సిన డిబెట్‌ రద్దయింది. ట్రంప్‌కు కరోనా రావడంతో ఆయన శ్వేత సౌధానికే పరిమితం అయ్యారు. వచ్చే వారంలో బెల్మాంట్‌ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిలో పాల్గొననున్నారట. దీంతో ఈ డిబెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయా డిబెట్లలో బైడెన్‌ పైచేయి సాధించిన విషయం తెలిసిందే.