ట్రెయిన్ రివర్స్: ఎస్ఈసీ నిమ్మగడ్డపై చంద్రబాబు సంచలన ఆరోపణలు

టీడీపీ అధినేత చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్. నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకమై టీడీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేస్తూ ఏపీలోని జగన్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇప్పటికీ జగన్ ను విసిగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సడెన్ గా చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల […]

Written By: NARESH, Updated On : February 11, 2021 9:20 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేశ్. నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకమై టీడీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేస్తూ ఏపీలోని జగన్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇప్పటికీ జగన్ ను విసిగిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే నిమ్మగడ్డ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సడెన్ గా చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

నిమ్మగడ్డ పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్న వేళ టీడీపీ అధినేత అదే నిమ్మగడ్డపై ఆరోపణలు గుప్పించడం విశేషం. పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన అధికారాలను పూర్తిగా ఉపయోగించలేదన్నారు. టీడీపీ అభ్యర్థులపై కేసులు పెగుతున్నారని.. నామినేషన్లను తిరస్కరిస్తున్నారని.. ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని.. నిమ్మగడ్డ రమేశ్ ఏం చేస్తున్నారని విమర్శించారు.

ఇన్నాళ్లు చంద్రబాబు చెప్పినట్టు నిమ్మగడ్డ చేశారేమోనని.. ఇప్పుడు చేయడం లేదనే చంద్రబాబు ఊగిపోతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. గవర్నర్ తో భేటి తర్వాత నిమ్మగడ్డ కాస్త జోరు తగ్గించి ఏకగ్రీవాలకు ఓకే చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు దీన్ని జీర్ణించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరి నిమ్మగడ్డకు చంద్రబాబుకు ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పంచాయతీ ఎన్నికలు చిచ్చుపెట్టినట్టే కనిపిస్తోంది.