https://oktelugu.com/

సినిమాల వల్లే నా భార్య నాకు విడాకులిచ్చింది.. ప్రముఖ నటుడి ఆవేదన

రంగుల ప్రపంచంలో హీరోగా ఉంటే వచ్చే ఆ పేరు,ప్రతిష్ట అంతా ఇంతా కాదు.. దానికోసం చాలా మంది తపనపడుతుంటారు. క్రేజ్ తోపాటు డబ్బు వచ్చే సినిమాలోకాన్ని అస్వాదిస్తారు. వారి చుట్టూ ఉన్న వాళ్లు సైతం ఆ లోకంలో ఎంజాయ్ చేస్తారు. కానీ అదే సినిమా జీవితం కొందరికి శాపంగా మారుతుంది. వారి వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఒకప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోగా ఎదిగి.. ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన హీరో సురేష్ తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 08:55 PM IST
    Follow us on

    రంగుల ప్రపంచంలో హీరోగా ఉంటే వచ్చే ఆ పేరు,ప్రతిష్ట అంతా ఇంతా కాదు.. దానికోసం చాలా మంది తపనపడుతుంటారు. క్రేజ్ తోపాటు డబ్బు వచ్చే సినిమాలోకాన్ని అస్వాదిస్తారు. వారి చుట్టూ ఉన్న వాళ్లు సైతం ఆ లోకంలో ఎంజాయ్ చేస్తారు.

    కానీ అదే సినిమా జీవితం కొందరికి శాపంగా మారుతుంది. వారి వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఒకప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరోగా ఎదిగి.. ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన హీరో సురేష్ తాజాగా తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

    తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తనతోపాటు ఓ సినిమాలో హీరోయిన్ గా నటించిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని సురేష్ తెలిపారు. అయితే తనకు సినిమాలంటే ఇష్టం లేదని.. బాగా చదువుకొని అమెరికా వెళ్లిపోదామన్నదని వివరించారు. అప్పుడు తానూ ఇండస్ట్రీలో బాగా లేకపోవడంతో సరేనన్నాని తెలిపారు.

    కానీ ఊహించని విధంగా పెళ్లి చేసుకున్నాక వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయని.. తాను హీరోగా బీజీ అయ్యానని సురేష్ తెలిపాడు. ఏడాదిలో 18 సినిమాలు తీసి పాపులర్ అయిన వేళ తన భార్య మాత్రం ఈ సినిమా జీవితాన్ని వదిలేయాలని ఫోర్స్ చేసిందన్నారు. కానీ తాను వదలకపోవడంతో తనను వదిలి చెన్నై వెళ్లి చదువుకొని అమెరికాకు వెళ్లిపోయిందని సురేష్ వాపోయాడు.

    ఇప్పటికీ అమెరికా వెళితే తన మాజీ భార్యను కలుస్తానని.. తన భార్య కూడా ఆమెకు ఫ్రెండ్ అయ్యిందని సురేష్ వివరించాడు. ఇద్దరం కలిసి తమ కెరీర్ల కోసం విడాకులు తీసుకున్నామని సురేష్ తెలిపారు. తాను మరో పెళ్లి చేసుకున్నట్టు వివరించాడు. ఇలా సినిమా జీవితం తన సంసారాన్ని చిన్నాభిన్నం చేసిందని సురేష్ తెలిపాడు.