చంద్రబాబు, పీవీ.. ఒక మరుపు కథ.!

పాలన వికేంద్రీకరణ.. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌. ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా అదే రూట్‌లో పయనిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల పేర్లపై రాష్ట్రమంతటా చర్చ మొదలైంది. దేశం కోసం ప్రాణత్యాగం […]

Written By: NARESH, Updated On : September 5, 2020 9:40 am
Follow us on

పాలన వికేంద్రీకరణ.. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌. ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా అదే రూట్‌లో పయనిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల పేర్లపై రాష్ట్రమంతటా చర్చ మొదలైంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు.. రాజకీయాల్లో దివికేగిన వారు.. వివిధ ప్రముఖుల పేర్లు పెడతుంటారు. ఏ నాయకుడికి ఏ జిల్లాతో సంబంధం ఉంది.. అక్కడి జిల్లా ప్రజలకు ఆ నాయకుడి పేరు నచ్చుతుందా లేదా అని చూసి పేరు పెట్టాలి. ఇక జగన్‌ కూడా తన పాదయాత్ర సందర్భంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌‌ వంటి మహనీయుల పేర్లు కొత్త జిల్లాలకు పెడుతామంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఇంకొంత మంది మహానుభావుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

Also Read: ఏపీ మంత్రి ప్రాణాలకు ముప్పు? పటిష్ట భద్రత

తాజాగా.. 13 కొత్త జిల్లాల్లో ఏదేని జిల్లాకు దేశ మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్‌ వస్తోంట. పీవీ నరసింహారావుది తెలంగాణ రాష్ట్రం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో వంగర గ్రామం. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరును ఏ జిల్లాకూ పెట్టని కేసీఆర్‌‌ ఇప్పుడు శత జయంతి ఉత్సవాల పేరిట హంగామా చేస్తున్నాడు. అంతేకాదు ఆయన పేరుని వాడుకుంటూ భారతరత్న ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. ఇక ఏపీలో కూడా వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పీవీ పేరును ప్రతిపాదిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. పీవీ మన ఠీవీ అని.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుగు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ అనుబంధ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కూడా కొందరు జగన్‌కు లేఖ రాశారు. వారిదీ సేమ్‌ డిమాండ్‌.

ఇక పాతికేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే 1995 సెప్టెంబర్ 1న ఎన్టీయార్‌‌ను కూలదోసి చంద్రబాబు ఉమ్మడి ఏపీకి కొత్త సీఎం అయ్యారు. ఆనాడు కేంద్రంలో ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. నిజానికి అదే ఏడాది ఉగాదికి ప్రధాని హోదాలో ఉన్న పీవీని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు ఎన్టీఆర్‌‌. అలాగే పీవీ ప్రధానిగా నెగ్గిన తరువాత నంద్యాల నుంచి పీవీ పోటీ చేస్తే టీడీపీ నుంచి పోటీ పెట్టకుండా రామారావు తన సహకారం అందించారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్టీఆర్‌‌ను అక్రమంగా చంద్రబాబు తొలగించిన ఎపిసోడ్ లో పీవీ మౌన పాత్ర వహించారని ప్రచారం. ఎన్టీఆర్ ఈ విషయంలో తనకు సాయం చేయాలని ప్రధాన హోదాలో ఉన్న పీవీని కోరినట్లుగానూ ప్రచారం జరిగింది. కానీ పీవీ మాత్రం మామా అల్లుడు వివాదంగా దాన్ని చూశారని అంటుంటారు. అంతే కాదు.. రాజ్యాంగం ప్రకారం ఎలా చేయాలో అలా చేయమన్నట్లుగా నాటి గవర్నర్ కృష్ణ కాంత్‌కు చెప్పారని కూడా చెబుతుంటారు. ఆ విధంగా మెజారిటీ చంద్రబాబుకే ఉండడంతో ఆయన్ని సీఎంగా ప్రకటించారు గవర్నర్‌‌. దీన్ని చూసి పీవీ కూడా సరేనని వదిలేశారు. అంటే ఓ విధంగా చంద్రబాబు సీఎం అయన ఎపిసోడ్‌లో పీవీ జోక్యం చేసుకోకపోవం అతి పెద్ద వరంగా చెప్పుకోవాలి. మరి దానికి ధన్యవాదంగా అయినా చంద్రబాబు పీవీ పేరు ఏపీకి పెట్టమని జగన్‌ని కోరాల్సిందే.

Also Read: బ్రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు

ముందు నుంచీ కాంగ్రెస్‌ ఉన్న వైఎస్సార్‌‌ కుటుంబం.. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్‌ కొత్త పార్టీని స్థాపించారు. అయితే.. వైఎస్సార్‌‌ కుటుంబానికి, పీవీకి ఏదో తెలియని రాజకీయ అగాధం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌‌ను సీఎం కానీయలేదని చెబుతుంటారు. మరి ఇప్పుడు బంతి జగన్‌ కోర్టులో ఉండిపోయింది. అప్పటి వివాదాలు.. పొరపొచ్చాలు అన్నీ వదిలి జిల్లాకు పేరు పెడతారా..? లైట్‌ తీసుకుంటారా..? దీని మీదనే ప్రధాన చర్చ నడుస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో.