కేంద్రబడ్జెట్: ఏపీకి వరం.. తెలంగాణకు శాపం

శరామామూలుగానే కేంద్రం అప్పుల్లో ఉండి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు ఓ వరం ప్రకటించింది. ఇక ధనిక రాష్ట్రమని గొప్పలకు పోయిన తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించకుండా మొండి చూయి చూపించింది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను సమర్పించారు. అనంతరం ట్యాబ్ లో చూసి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, కేరళ […]

Written By: NARESH, Updated On : February 1, 2021 12:38 pm
Follow us on

శరామామూలుగానే కేంద్రం అప్పుల్లో ఉండి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు ఓ వరం ప్రకటించింది. ఇక ధనిక రాష్ట్రమని గొప్పలకు పోయిన తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించకుండా మొండి చూయి చూపించింది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను సమర్పించారు. అనంతరం ట్యాబ్ లో చూసి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఇక ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ లో కేంద్రఆర్థిక మంత్రి నిర్మల పెద్దపీట వేశారు. ఆ రెండు రాష్ట్రాల్లోని చెన్నై, కోచి మెట్రోలతోపాటు బీజేపీ పాలిత బెంగళూరు మెట్రోకు వేల కోట్ల రూపాయలు కురిపించారు. చెన్నై మెట్రోకు రూ.63246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14788 కోట్లు కేటాయించింది.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు నిధుల కోసం కోరినా మొండి చేయి చూపించింది.చెన్నై, బెంగళూరుల కంటే తీసిపోని హైదరాబాద్ కు కేంద్రం మొండి చేయి చూపడంపై తెలంగాణ రాష్ట్రసమితి నేతలు, మంత్రులు బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమిళనాడు, కేరళ ఎన్నికల నేపథ్యంలోనే ఆరాష్ట్రాలపై బీజేపీ నిధులు కురిపించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ కోరినా కూడా తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోకు రూపాయి విదిల్చలేదు.

ఇక అప్పుల్లో ఉన్న ఏపీకి ఓ వరాన్ని కేంద్రం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం చాలా రోజులుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అడుగుతున్న సంగతి తెలిసిందే. విభజన హామీలోనూ ఉన్న దాన్ని బీజేపీ పెడచెవిన పెట్టింది. కానీ బడ్జెట్ లో మాత్రం ఓ కారిడార్ ను తాజాగా ప్రకటించి ఉపశమనాన్ని ఇచ్చింది.ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు.. రైల్వే మౌలిక సౌకర్యాలకు ఏకంగా రూ.1,01,055 కోట్లు కేటాయించనున్నట్టు నిర్మల తెలిపారు.

ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ -కోస్ట్ సరుకు రవాణా కారిడార్ కేంద్రం ప్రకటించింది. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే ఈ లైన్ లో 2023 కల్లా విద్యుదీకరణ కూడా పూర్తి చేస్తామని సభలో తెలిపారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.