పేరెంట్స్‌ సమ్మతితోనే స్కూల్‌లోకి ఎంట్రీ

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ బడిబాట పట్టారు. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కామన్‌గా జూన్‌ రెండో వారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. ఏడు నెలలు ఆలస్యంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్‌ ఓపెన్‌ అయ్యాయి. 9,10 తరగతులతోపాటు ఇంటర్‌‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. Also Read: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.33 వేల కోట్లు […]

Written By: Srinivas, Updated On : February 1, 2021 5:19 pm
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ బడిబాట పట్టారు. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కామన్‌గా జూన్‌ రెండో వారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. ఏడు నెలలు ఆలస్యంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్‌ ఓపెన్‌ అయ్యాయి. 9,10 తరగతులతోపాటు ఇంటర్‌‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Also Read: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.33 వేల కోట్లు

వైద్య కాలేజీలు, గురుకుల విద్యాలయాలు కూడా సోమవారం తెరుచుకున్నాయి. పలువురు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి కోవిడ్‌ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. బడికి పంపేందుకు తల్లిదండ్రుల సమ్మతి లేఖ ఇస్తేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఇప్పటివరకు లేఖ ఇవ్వని వారు.. ఈ రోజు మాత్రం తప్పకుండా లెటర్‌‌ ఇచ్చాకనే లోపలికి అనుమతిస్తున్నారు.

Also Read: అధ్యక్షుడు కాకున్నా.. డైరెక్షన్‌ మొత్తం ఆయనదే..!

రాష్ట్రంలో స్కూళ్లను పలువురు మంత్రులు, అధికారులు తనిఖీ చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు అందోలులో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులాన్ని పరిశీలించేందుకు వెళ్లగా అక్కడ గేటు వేసి ఉంది. వార్డెన్లు, కేర్‌‌ టేకర్లు లేకపోవడంతో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. కోవిడ్‌ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ విద్యాసంస్థలు నడపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌ హైదరాబాద్‌లోని సంక్షేమ వసతి గృహాలను పరిశీలించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

2019–20 సంవత్సరంలో ప్రవేశాలు పొందిన తొలి ఏడాది ఎంబీబీఎస్‌, ఆయుష్‌ విద్యార్థులకు, 2016–17లో ప్రవేశాలు పొంది ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌‌ పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తరగతులు ప్రారంభించింది. వీరితోపాటు పారామెడికల్‌ ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు, దంత వైద్యవిద్యలో 2019–20లో ప్రవేశాలు పొందిన వారికి తరగతులు స్టార్ట్‌ చేశారు. 2020–21లో అడ్మిషన్లు పొందిన వారికి వైద్య కాలేజీలు తెరిచిన వారంలో ఏదో ఒకరోజు కాలేజీకి వచ్చి.. తమకు సంబంధించిన సమాచారాన్ని పొందాల్సి ఉంది.