Homeజాతీయ వార్తలుజానాకు దీటైన అభ్యర్థుల కోసం వేట .: సాగర్‌‌పై పార్టీల ఫోకస్‌

జానాకు దీటైన అభ్యర్థుల కోసం వేట .: సాగర్‌‌పై పార్టీల ఫోకస్‌

TRS

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగబోతోంది. నాగార్జున సాగర్‌‌ ఎమ్మెల్యే ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించబోతున్నారు. ఇపుడు ప్రధాన పార్టీల చూపంతా సాగర్‌‌ మీదనే పడింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికను వచ్చే సాధారణ ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికను, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కూడా పార్టీలు అలాగే భావించాయి.

మరోవైపు.. ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ తాపత్రయ పడుతోంది. టీఆర్‌‌ఎస్‌ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించి తీరుతామని బీజేపీ విశ్వాసంతో ఉంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే నాగార్జున సాగర్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ లక్ష్యం ఘనంగా ఉన్నా అక్కడ కాషాయం పార్టీకి బలం లేదు. ముందుగా అక్కడ అభ్యర్థిని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితే ఉంది. నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థిని నిర్ణయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

Also Read: అభిమానం అంటే ఇదేనేమో..!

కాంగ్రెస్‌కు ఆల్రెడీ అభ్యర్థి ఖరారయ్యాడు. పార్టీలో మోస్ట్ సీనియర్, అనేకసార్లు నాగార్జున సాగర్ నుంచి జయకేతనం ఎగరేసిన పెద్దాయన జానారెడ్డి పోటీకి సిద్ధమయ్యాడు. సాగర్‌‌ ఉప ఎన్నిక నేపథ్యంలో చివరకు పీసీసీ అధ్యక్ష నియామకాన్ని సైతం వాయిదా వేయించారు. అందుకే.. ఆయనకు దీటైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్ అండ్ బీజేపీలు గాలిస్తున్నాయి. కాషాయం పార్టీ ముందుగా జానారెడ్డి కోసం ప్రయత్నించినా వలలో పడలేదు. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో గెలుపుతో మంచి బూస్టింగ్‌తో ఉన్న కాషాయం దండు ఇక్కడా గెలుపొందాలని తహతహలాడుతోంది.

Also Read: సాగర్‌‌లో అభ్యర్థుల వేట

ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని, నాగార్జున సాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. ఇక టీఆర్‌ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేక వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది. దుబ్బాకలో మరణించిన ఎమ్మెల్యే భార్యకే అవకాశం ఇచ్చారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. సాగర్‌లో దాన్నే రిపీట్ చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బీసీలకు కాకుండా రెడ్డివర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version